1 విగ్రహములకు బలిగా అర్పించినవాటి విషయమై నేను చెప్పునదేమనగా - మనమందరము జ్ఞానము గలవారమని యెరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. 2 ఒకడు తనకేమైనను తెలియుననుకొంటే తాను తెలిసికొనవలసినట్టు ఇంక ఏమియు తెలిసికొనినవాడుకాడు. 3 ఒకడు దేవుని ప్రేమించినయెడల అతడు దేవునికి ఎరుకైనవాడే. 4 కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించినవాటిని తినుట విషయమై (నేను చెప్పునదేమనగా ) - లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. 5-6. దేవతలనబడినవారును ప్రభువులనబడినవారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒకే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము. 7 అయితే అందరియందు ఈ జ్ఞానము లేదు. కొందరిదివరకును విగ్రహమును ఆరాధించువారు గనుక (తాము భుజించుపదార్థములు ) విగ్రహమునకు బలియియ్యబడినవని యెంచి భుజించుదురు; ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది. 8 భోజనమునుబట్టి దేవునియెదుట మనము మెప్పుపొందము; తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువలేదు. 9 అయినను మీకు కలిగియున్న యీ స్వాతంత్ర్యమువలన బలహీనులకు అభ్యంతరము కలుగకుండ చూచుకొనుడి. 10 ఏలయనగా జ్ఞానముగల నీవు విగ్రహాలయమందు భోజనపంక్తిని కూర్చుండగా ఒకడు చూచినయెడల, బలహీనమైన మనస్సాక్షిగల అతడు విగ్రహములకు బలి యియ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకొనును గదా? 11 అందువలన ఎవనికొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానమునుబట్టి నశించును. 12 ఈలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుటవలనను, వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుటవలనను, 2మీరు క్రీస్తుకు విరోధముగా పాపము చేయువారగుచున్నారు. 13 కాబట్టి భోజనపదార్థమువలన నా సహోదరునికి అభ్యంతరము కలిగినయెడల, నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయకుండుటకై నేనెన్నటికిని మాంసము తినను. Download Audio File
1 నేను స్వతంత్రుడను కానా? నేను అపొస్తలుడను కానా? మన ప్రభువైన యేసును నేను చూడలేదా? ప్రభువునందు నా పనికి ఫలము మీరు కారా? 2 ఇతరులకు నేను అపొస్తలుడను కాకపోయినను మీ మట్టుకైనను అపొస్తలుడనై యున్నాను. ప్రభువునందు నా అపొస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా? 3 నన్ను విమర్శించువారికి నేను చెప్ప సమాధానమిదే. 4 తినుటకును త్రాగుటకును మాకు అధికారము లేదా? 5 తక్కిన అపొస్తలులవలెను, ప్రభువుయొక్క సహోదరులవలెను, కేఫావలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా? 6 మరియు పని చేయకుండుటకును నేనును బర్నబాయు మాత్రమే అధికారము లేనివారమా? 7 ఎవడైనను తన స్వంత ఖర్చుపెట్టుకొని దండుకొలువు చేయునా? ద్రాక్షతోట వేసి దాని ఫలము తిననివాడెవడు? మందను కాచి మంద పాలు త్రాగనివాడెవడు? 8 ఈ మాటలు లోకాచారమునుబట్టి1చెప్పుచున్నానా? ధర్మశాస్త్రముకూడ వీటిని చెప్పుచున్నది గదా? 9 కళ్లము త్రొక్కుచున్న యెద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నది. 2 10 దేవుడు ఎడ్లకొరకు విచారించుచున్నాడా? కేవలము మనకొరకు దీని చెప్పుచున్నాడా? అవును, మనకొరకే గదా యీ మాట వ్రాయబడెను. ఏలయనగా, దున్నువాడు (పాలుపొందుదునను ) ఆశతో దున్నవలెను, కళ్లము త్రొక్కించువాడు పంటలో పాలుపొందుదునను ఆశతో త్రొక్కింపవలెను. 11 మీ కొరకు ఆత్మసంబంధమైనవి మేము విత్తియుండగా మీ వలన శరీరసంబంధమైన ఫలములు కోసికొనుట గొప్పకార్యమా? 12 ఇతరులకు మీ పైని యీ అధికారములో పాలు కలిగినయెడల మాకు ఎక్కువ కలదు గదా? అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు; క్రీస్తుసువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండుటకై అన్నిటిని సహించుచున్నాము. 13 ఆలయకృత్యములు జరిగించువారు ఆలయమువలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠమునొద్ద కనిపెట్టుకొని యుండువారు బలిపీఠముతో పాలివారై యున్నారనియు మీరెరుగరా? 14 ఆలాగున సువార్త ప్రచురించువారు సువార్తవలన జీవింపవలెనని ప్రభువు నియమించియున్నాడు. 15 నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకొనలేదు; మీరు నాయెడల ఈలాగున జరుపవలెనని ఈ సంగతులు వ్రాయనులేదు. ఎవడైనను నా అతిశయమును నిరర్థకము చేయుటకంటె నాకు మరణమే మేలు. 16 నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయకారణము లేదు. (సువార్తను ప్రకటింపవలసిన ) భారము నామీద మోపబడి యున్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ. 17 ఇది నేనిష్టపడి చేసిన యెడల నాకు జీతము కలుగును. ఇష్టపడకపోయినను గృహనిర్వాకత్వము నాకు అప్పగింపబడెను. 18 అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించునప్పుడు సువార్తయందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండ సువార్తను ఉచితముగా ప్రకటించుటయే (నాకున్న జీతము ) 19 నేను అందరి విషయము స్వతంత్రుడనై యున్నను ఎక్కువమందిని సంపాదించికొనుటకై అందరికిని నన్ను నేనే దాసునిగా చేసికొంటిని. 20 యూదులను సంపాదించికొనుటకు యూదులకు యూదునివలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించికొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడినవాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడినవానివలె ఉంటిని. 21 దేవునివిషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తువిషయమై ధర్మశాస్త్రమునకు లోబడినవాడను. అయినను ధర్మశాస్త్రము లేనివారిని సంపాదించికొనుటకు ధర్మశాస్త్రము లేనివారికి ధర్మశాస్త్రము లేనివానివలె ఉంటిని. 22 బలహీనులను సంపాదించికొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధముచేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికి అన్ని విధములవాడనై యున్నాను. 23 మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దానికొరకే సమస్తమును చేయుచున్నాను. 24 పందెపు రంగమందు పరిగెత్తువారందరు పరుగెత్తుదురు గాని యొక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలె మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి. 25 మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. 26 కాబట్టి నేను గురి చూడనివానివలె పరుగెత్తువాడను కాను, 27 గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒక వేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దాని లోపరచుకొనుచున్నాను. Download Audio File
1 సహోదరులారా, యీ సంగతి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు. అదేదనగా, మన పితరులందరు మేఘముక్రింద నుండిరి. వారందరును సముద్రములో నడిచిపోయిరి; 2 అందరును మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి; 3 అందరు ఆత్మసంబంధమైన ఒక్క ఆహారమునే భుజించిరి; 4 అందరు ఆత్మసంబంధమైన ఒక్క పానీయమునే పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మసంబంధమైన బండలోనిది త్రాగిరి; 5 అయితే వారిలో ఎక్కువమంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. 6 వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. 7 -జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు1వారిలో కొందరివలె మీరు విగ్రహారాధకులై యుండకుడి. 8 మరియు వారివలె మనము వ్యభిచరింపక యుందము; వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే యిరువది మూడు వేలమందికూలిరి. 9 మనము ప్రభువును2శోధింపక యుందము; వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. 10 మీరు సణుగకుడి; వారిలో కొందరు సణిగి సంహారకునిచేత నశించిరి. 11 ఈ సంగతులు దృష్టాంతరూపకములుగా వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. 12 తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. 13 సాధారణముగా మనుష్యులకు కలుగు శోధనతప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు; మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును. 14 కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపొండి. 15 బుద్ధిమంతులతో మాటలాడినట్లు మీతో మాటలాడుచున్నాను; నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. 16 మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది3(త్రాగుట ) క్రీస్తు రక్తములో పాలుపుచ్చుకొనుటయే. మనము విరుచు రొట్టె (తినుట ) క్రీస్తు శరీరములో పాలుపుచ్చుకొనుటయే. 17 మనమందరము ఆ యొకటే రొట్టెలో పాలుపుచ్చుకొనుచున్నాము; రొట్టె యొక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమైయున్నాము. 18 శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలి అర్పించినవాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కాదా? 19 ఇక నేను చెప్పునదేమి? విగ్రహార్పితములో ఏమైన ఉన్నదనియైనను విగ్రహములలో ఏమైన ఉన్నదనియైనను చెప్పెదనా? 20 లేదుగాని అన్యజనులర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవుట నాకిష్టము లేదు. 21 మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడ త్రాగనేరరు; ప్రభువు బల్లమీద ఉన్న దానిలోను దయ్యముల బల్లమీద ఉన్న దానిలోనుకూడ పాలుపొందనేరరు. 22 ప్రభువుకు రోషము పుట్టించెదమా? ఆయనకంటె మనము బలవంతులమా? 23 అన్ని విషయములయందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు. 24 ఎవడును తనకొరకే కాదు ఎదుటివానికొరకు మేలుచేయ చూచుకొనవలెను. 25 మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దాని తినవచ్చును. 26 - భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివై యున్నవి. 4 27 అవిశ్వాసులలో ఒకడు విందుకు పిలిచినపుడు వెళ్లుటకు మీకు మనస్సుండినయెడల మీకు వడ్డించినది ఏదో దానిగూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక తినుడి. 28 అయితే ఎవడైనను మీతో - ఇది బలి అర్పింపబడినదని చెప్పినయెడల అట్లు తెలిపినవాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి. 29 మనస్సాక్షి నిమిత్తమనగా నీ స్వంత మనస్సాక్షి నిమిత్తము కాదు ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే యీలాగు చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకని మనస్సాక్షినిబట్టి నా స్వాతంత్ర్య విషయములో తీర్పు తీర్చబడనేల? 30 నేను కృతజ్ఞతతో పుచ్చుకొనినయెడల నేను దేనినిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానో దానినిమిత్తము నేను దూషింపబడనేల? 31 కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి. 32 యూదులకైనను, హెల్లేనీయులకైనను, దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగజేయకుడి. 33 ఈలాగు నేను కూడ స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలెనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరిని సంతోషపెట్టుచున్నాను. Download Audio File
1 నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. 2 మీరు అన్నివిషయములలో నన్ను జ్ఞాపకము చేసికొనుచు, నేను మీకు అప్పగించిన ప్రకారము కట్టడలను5గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. 3 ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తుకు శిరస్సు దేవుడనియు మీరు తెలిసికొనవలెనని కోరుచున్నాను. 4 ఏ పురుషుడును తలమీద ముసుకు వేసికొని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో, ఆ పురుషుడు తన తలను అవమానపరచును. 5 ఏ స్త్రీ తలమీద ముసుకు వేసికొనక ప్రార్థనచేయునో లేక ప్రవచించునో, ఆ స్త్రీ తన తలను అవమానపరచును; ఏలయనగా ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే యుండును. 6 స్త్రీ ముసుకు వేసికొననియెడల ఆమె తలవెండ్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుటయైనను క్షౌరము చేయించుకొనుటయైనను స్త్రీ కవమానమైతే ముసుకు వేసికొనవలెను. 7 పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునైయున్నాడు గనుక తలమీద ముసుకు వేసికొనకూడదు గాని స్త్రీ పురుషుని మహిమయై యున్నది. 8 ఏలయనగా స్త్రీ పురుషునినుండి కలిగెనే గాని పురుషుడు స్త్రీనుండి కలుగలేదు. 9 మరియు స్త్రీ పురుషునికొరకే గాని పురుషుడు స్త్రీకొరకు సృష్టింపబడలేదు. 1 10 ఇందువలన దేవుదూతలనుబట్టి (భర్త ) అధికార సూచనగా స్త్రీకి తలమీద ముసుకు ఉండవలెను. 11 అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు పురషునికి వేరుగా స్త్రీ లేదు. 12 స్త్రీ పురుషుని మూలముగా ఏలాగు కలిగెనో ఆలాగే పురుషుడు స్త్రీనుండి కలిగెనుగాని సమస్తమైనవి దేవుని మూలముగా కలిగియున్నవి. 13 మీలో మీరే యోచించుకొనుడి; స్త్రీ ముసుకులేనిదై దేవుని ప్రార్థించుట తగునా? 14 పురుషుడు తలవెండ్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావసిద్ధముగా మీకు తోచునుగదా? 15 స్త్రీకి తలవెండ్రుకలు పైటచెంగుగా ఇయ్యబడెను గనుక ఆమె తలవెండ్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము. 16 ఎవడైనను కలహప్రియుడుగా కనబడినయెడల మాలోనైనను దేవుని సంఘములలోనైనను ఇట్టి ఆచారములేదని (వాడు తెలిసికొనవలెను. ) 17 మీకు ఈ విధి నియమించుచు మిమ్మును మెచ్చుకొనను. మీరు కూడివచ్చుట యెక్కువ కీడుకేగాని యెక్కువ మేలుకు కాదు. 18 మొదటి సంగతి యేమనగా, మీరు సంఘమందు కూడియున్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంతమట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. 19 మీలో యోగ్యులైనవారెవరో కనబడునట్లు మీలో భిన్నాభిప్రాయములుండక విధిలేదు. 20 మీరందరు కూడి వచ్చుచుండగా మీరు ప్రభువు రాత్రిభోజనము చేయుట సాధ్యము కాదు. 21 ఏలయనగా మీరు ఆ భోజనము చేయునప్పుడు ఒకనికంటె ఒకడు ముందుగా తనమట్టుకు తాను భోజనము చేయుచున్నాడు; ఇందువలన ఒకడు ఆకలిగొనును మరియొకడు మత్తుడవును. 22 ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిగూర్చి మిమ్మును మెచ్చుదునా? మెచ్చను. 23 నేను ఈ విషయమై మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు అప్పగింపబడిన రాత్రి యొక రొట్టెను ఎత్తికొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి 24 దాని విరిచి - యిది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీని చేయుడని చెప్పెను. 25 ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొని - యీ పాత్ర నా రక్తమువలననైన క్రొత్తనిబంధన; మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీని చేయుడని చెప్పెను. 26 మీరు ఈ రొట్టెను తిని యీ పాత్రలోనిది త్రాగునప్పుడెల్ల ప్రభువు వచ్చు పర్యంతము ఆయన మరణమును ప్రచురించుదురు. 27 కాబట్టి యెవడు అయోగ్యముగా ప్రభువుయొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువుయొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. 28 కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను; ఆలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. 29 ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. 30 ఇందువలననే మీలో అనేకులు బలహీనులును రోగులునై యున్నారు; చాలమంది నిద్రించుచున్నారు. 31 అయితే మనలను మనమే విమర్శించుకొనినయెడల తీర్పు పొందక పోదుము. 32 మనము తీర్పు పొందినయెడల లోకముతోపాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువుచేత శిక్షింపబడుచున్నాము. 33 కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చునప్పుడు ఒకనికొరకు ఒకడు కనిపెట్టుకొని యుండుడి. 34 మీరు కూడివచ్చుట శిక్షావిధికి కారణము కాకుండునట్లు, ఎవడైన ఆకలిగొనినయెడల తన యింటనే భోజనము చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరతును. Download Audio File
1 మరియు సహోదరులారా, ఆత్మసంబంధమైన వరములనుగూర్చి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు. 2 మీరు అన్యజనులై యున్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితిరని మీకు తెలియును. 3 ఇందుచేత దేవుని ఆత్మవలన మాటలాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మవలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. 4 కృపావరములు నానావిధములుగా ఉన్నవి గాని ఆత్మ యొక్కడే 5 మరియు పరిచర్యలు నానావిధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే 6 నానావిధములైన కార్యములు కలవు గాని అందరిలో అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే 7 అయినను (అందరి ) ప్రయోజనముకొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. 8 ఏలాగనగా, ఒకనికి ఆత్మమూలముగా జ్ఞానవాక్యమును, మరియొకనికి ఆ ఆత్మ ననుసరించిన బుద్ధివాక్యమును, 9 మరియొకనికి ఆ ఆత్మవలననే విశ్వాసమును, మరియొకనికి ఆ ఒక్క ఆత్మవలననే స్వస్థపరచు వరములును 10 మరియొకనికి అద్భుతకార్యములను చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరియొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడియున్నవి. 11 అయినను వీటన్నిటిని ఆ ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి యిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. 12 ఏలాగు శరీరము ఏకమై యున్నను అనేకమైన అవయవములు కలిగియున్నదో, యేలాగు శరీరముయొక్క అవయవములన్నియు అనేకములై యున్నను ఒక్క శరీరమై యున్నవో, ఆలాగే క్రీస్తు ఉన్నాడు. 13 ఏలాగనగా, యూదులమైనను హెల్లేనీయులమైనను, దాసులమైనను స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరముగా ఉండుటకు1ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానముచేసినవారమైతిమి. 14 శరీరమొక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. 15 - నేను చెయ్యి కాను గనుక శరీరములోనిదానను కానని పాదము చెప్పినంతమాత్రమున శరీరములోనిది కాకపోలేదు. 16 మరియు - నేను కన్నుకాను గనుక శరీరములోనిదానను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. 17 శరీరమంతయు కన్నయితే వినుట ఎక్కడ? అంతయు వినుటయైతే వాసనచూచుట ఎక్కడ? 18 అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్తప్రకారము శరీరములో నుంచెను. 19 అవన్నియు ఒక్క అవయవమైతే శరీరమెక్కడ? 20 అవయవములు అనేకములైనను శరీరమొక్కటే 21 గనుక కన్ను చేతితో - నీవు నాకక్కరలేదని చెప్పజాలదు; తల పాదములతో - మీరు నాకక్కరలేదని చెప్పజాలదు. 22 అంతే కాదు. శరీరముయొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే 23 శరీరములో ఏ అవయవములు ఘనతలేనివని తలంతుమో ఆ అవయవములు మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. సుందరములకాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. 24-25. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యమక్కరలేదు. అయితే శరీరములో వివాదములేక, అవయవములు ఒకదానినొకటి యేకముగా పరామర్శించులాగున, దేవుడు తక్కువదానికే యెక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చియున్నాడు. 26 కాగా ఒక అవయవము శ్రమపడునప్పుడు అవయవములన్నియు దానితో కూడ శ్రమపడును; ఒక అవయవము ఘనత పొందునప్పుడు అవయవములన్నియు దానితోకూడ సంతోషించును. 27 అటువలె మీరు క్రీస్తుయొక్క శరీరమైయుండి వేరువేరుగా అవయవములై యున్నారు. 28 మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలగాను, పిమ్మట కొందరిని బోధకులగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారినిగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారినిగాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను. 29 అందరు అపొస్తలులా? అందరు అద్భుతములు చేయువారా? 30 అందరు స్వస్థపరచు కృపావరములు గలవారా? అందరు ఆ భాషల అర్థము చెప్పుచున్నారా? 31 కృపావరములలో శ్రేష్ఠమైనవాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. Download Audio File
1 మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమలేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై యుందును. 2 ప్రవచించు కృపావరము కలిగి, మర్మములన్నియు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసముగలవాడనైనను, ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను. 3 (బీదల ) పోషణకొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమలేని వాడనైతే నాకు ప్రయోజనమేనియు లేదు. 4 ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు; 5 అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు. 6 దుర్ణీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. 7 అన్నిటికి తాళుకొనును;3అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును. 8 ప్రేమ శాశ్వతకాలముండును. ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును;జ్ఞానమైనను నిరర్థకమగును. 9 మనము కొంతమట్టుకు ఎరుగుదుము, కొంతమట్టుకు ప్రవచించుచున్నాము గాని 10 పూర్ణమైనది వచ్చినప్పుడు అపూర్ణమైనది నిరర్థకమగును. 11 నేను పిల్లవాడనై యున్నప్పుడు పిల్లవానివలె మాటలాడితిని, పిల్లవానివలె తలంచితిని, పిల్లవానివలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని. 12 ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము; అప్పుడు ముఖాముఖిగా చూతుము; ఇప్పుడు కొంతమట్టుకే యెరిగియున్నాను; అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. 13 కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలుచును; వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. Download Audio File
1 ప్రేమ కలిగియుండుటకు ప్రయత్నించుడి. 1ఆత్మసంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి; విశేషముగా మీరు ప్రవచనవరము అపేక్షించుడి. 2 ఎందుకనగా భాషతో మాటలాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాటలాడుచున్నాడు; మనుష్యుడెవడును గ్రహింపడుగాని వాడు ఆత్మవలన మర్మములను పలుకుచున్నాడు. 3 క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు, ప్రవచించువాడు మనుష్యులతో మాటలాడుచున్నాడు. 4 భాషతో మాటలాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసికొనును గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును. 5 మీరందరు భాషలతో మాటలాడవలెనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందునిమిత్తము భాషలతో మాటలాడువాడు అర్థము చెప్పితేనేగాని వానికంటె ప్రవచించువాడే శ్రేష్ఠుడు. 6 సహోదరులారా, ఆలోచించుడి; భాషలతో మాటలాడుచు నేను మీయెద్దకు వచ్చి (సత్యమును ) బయలుపరచవలెననియైనను జ్ఞానోపదేశము చేయవలెననియైనను ప్రవచింపవలెననియైనను బోధింపవలెననియైనను మీతో మాటలాడకపోయినయెడల, నావలన మీకు ప్రయోజనమేమి? 7 పిల్లనగ్రోవి గాని వీణె గాని, నిర్జీవ వస్తువులు నాదమిచ్చునప్పుడు, స్వరములలో భేదము కలుగజేయనియెడల, ఊదినదేమి మీటినదేమి యని యేలాగు తెలియును? 8 మరియు బూర స్పష్టముకాని ధ్వని ఇచ్చునప్పుడు యుద్ధమునకెవడు సిద్ధపడును? 9 ఆలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనేగాని పలికినది ఏలాగు తెలియును? మీరు గాలితో మాటలాడుచున్నట్టుందురు. 10 లోకమందు ఎన్నోవిధములగు భాషలున్నను వాటిలో ఒకటైనను స్పష్టము కానిదై యుండదు. 11 మాటల అర్థము నాకు తెలియకుండినయెడల మాటలాడువానికి నేను పరిదేశినిగా ఉందును, మాటలాడువాడు నాకు పరదేశిగా ఉండును. 12 మీరు ఆత్మసంబంధమైన వరముల విషయమై ఆసక్తిగలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగునిమిత్తము అవి మీకు విస్తరంచునట్లు ప్రయత్నము చేయుడి. 13 భాషతో మాటలాడువాడు అర్థము చెప్పు శక్తికలుగుటకై ప్రార్థనచేయలెను. 14 నేను భాషతో ప్రార్థనచేసినయెడల నా ఆత్మ ప్రార్థన చేయును గాని నా మనస్సు ఫలవంతముగా ఉండదు. 15 కాబట్టి ఆత్మతో ప్రార్థనచేతును మనస్సుతోను ప్రార్థన చేతును; ఆత్మతోను పాడుదును, మనస్సుతోను పాడుదును. 16 లేనియెడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు చెప్పుదాని గ్రహింపలేడు గనుక, నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు - ఆమేన్ అని వాడేలాగు పలుకును? 17 నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు గాని ఎదుటివాడు క్షేమాభివృద్ధిపొందడు. 18 నేను మీ యందరికంటె ఎక్కువగా భాషలతో మాటలాడుచున్నాను; అందుకు దేవుని స్తుతించెదను. 19 అయినను సంఘములో భాషతో పదివేల మాటలు పలుకుటకంటె ఇతరులకు బోధ కలుగునట్లు నా మనస్సుతో అయిదు మాటలు పలుకుట మేలు. 20 సహోదరులారా, మీరు బుద్ధివిషయమై పసిపిల్లలుకాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి; బుద్ధివిషయమై పెద్దవారలై యుండుడి. 21 - అన్యభాషలు మాటలాడు జనులద్వారాను, పర జనుల పెదవులద్వారాను, ఈ జనులతో మాటలాడుదును; అప్పటికైనను వారు నా మాట వినకపోదురు. అని ప్రభువు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నది. 2 22 కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమైయున్నవి. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే (సూచకమైయున్నది ). 23 సంఘమంతయు ఏకముగా కూడి అందరు భాషలతో మాటలాడుచుండగా, ఉపదేశము పొందనివారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చినయెడల మీరు వెర్రిమాటలాడుచున్నారని అనుకొందురు కదా? 24 అయితే అందరు ప్రవచించుచుండగా అవిశ్వాసియైనను ఉపదేశము పొందనివాడైనను లోపలికి వచ్చినయెడల, అందరి బోధవలన తాను పాపినని గ్రహించి అందరివలన విమర్శింపబడును. 25 అప్పుడతని హృదయ రహస్యములు బయలుపడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురముచేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారముచేయును. 26 సహోదరులారా, యిప్పుడు మీలో ఏమి జరుగుచున్నది? మీరు కూడివచ్చునప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలెనని యున్నాడు; మరి ఒకడు బోధింపవలెనని యున్నాడు; మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటనపరచవలెనని యున్నాడు; మరి ఒకడు భాషతో మాటలాడవలెనని యున్నాడు; మరి ఒకడు అర్థము చెప్పవలెనని యున్నాడు. సరే; సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగనియ్యుడి. 27 భాషతో ఎవడైనను మాటలాడితే, ఇద్దరు, అవసరమైనయెడల ముగ్గురికి మించకుండ, వంతులచొప్పున మాటలాడవలెను, ఒకడు అర్థము చెప్పవలెను. 28 అర్థము చెప్పువాడు లేనియెడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెను గాని తనతోను దేవునితోను మాటలాడుకొనవచ్చును. 29 ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాటలాడవచ్చును; తక్కినవారు వివేచింపవలెను. 30 అయతే కూర్చున్న మరి యొకనికి ఏదైనను బయలుపరచబడినయెడల మొదటివాడు మౌనముగా ఉండవలెను. 31 అందరు నేర్చుకొనునట్లు అందరు హెచ్చరికపొందునట్లును మీరందరు ఒకని తరువాత ఒకడు ప్రవచింపవచ్చును. 32 మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి. 33 ఆలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. 34 స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను వారు లోబడియుండవలసినదే గాని మాటలాడుటకు వారికి సెలవులేదు. ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది1. 35 వారు ఏమైనను నేర్చుకొనగోరినయెడల ఇంట తమ తమ భర్తల నడుగవలెను; సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము. 36 దేవుని వాక్యము మీయెద్ద నుండియె బయలువెళ్లెనా? మీయెద్దకు మాత్రమే వచ్చెనా? 37 ఎవడైనను తాను ప్రవక్తననియైనను ఆత్మసంబంధిననియైనను తలంచుకొనిన యెడల, నేను మీకు వ్రాయుచున్నవి ప్రభువుయొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలిసికొనవలెను. 38 ఎవడైనను తెలియనివాడైతే తెలియనివాడుగానే యుండనిమ్ము2 39-40. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాటలాడుట ఆటంకపరచకుడి గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనియ్యుడి Download Audio File