Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, July 26, 2013

1 కొరింథీయులకు 1వ అధ్యాయము

1  దేవుని చిత్తమువలన యేసు క్రీస్తు1యొక్క అపొస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సొస్తెనేసును 
2  కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికిని, వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతిస్థలములో ప్రార్థించు వారికందరికిని (శుభమని చెప్పి ) వ్రాయునది. 
3  మన తండ్రియైన దేవునినుండియు, ప్రభువైన యేసుక్రీస్తునుండియు కృపాసమాధానములు మీకు కలుగుగాక. 
4  క్రీస్తుయేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 
5-6. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయనయందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్తోపదేశములోను సమస్త జ్ఞానములోను సంపూర్ణులైతిరి; 
7  గనుక ఏ కృపావరమునందును లోపములేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షతకొరకు ఎదురుచూచుచున్నారు. 
8  మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై యుండునట్లు అంతమువరకు ఆయన మిమ్మును స్థిరపరచును. 
9  మన ప్రభువైన యేసుక్రీస్తను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. 
10  సహోదరులారా, మీరందరు ఏకభావముతో మాటలాడవలెననియు, మీలో కక్షలు లేక యేకమనస్సుతోను ఏకతాత్పర్యముతోను మీరు సన్నద్ధులైయుండవలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తుపేరట మిమ్మును వేడుకొనుచున్నాను. 
11  నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మునుగూర్చి క్లోయే యింటివారివలన నాకు తెలియవచ్చెను. 
12  మీలో ఒకడు - నేను పౌలువాడను, ఒకడు - అపొల్లోవాడను, మరియెకడు - నేను కేఫావాడను, ఇంకొకడు - నేను క్రీస్తువాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. 
13  క్రీస్తు విభజింపబడి యున్నాడా? పౌలు మీకొరకు సిలువ వేయబడెనా? పౌలు నామమున మీరు బాప్తిస్మముపొందితిరా? 
14-15. నా నామమున మీరు బాప్తిస్మము పొందితిరని యెవరైనను చెప్పకుండునట్లు, క్రిస్పుకును గాయియుకును తప్ప మరి ఎవరికిని నేను బాప్తిస్మమియ్యలేదు; అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 
16  స్తెఫను ఇంటివారికి బాప్తిస్మమిచ్చితిని; వీరికి తప్ప మరి ఎవరికైనను బాప్తిస్మమిచ్చితినేమో నేనెరుగను. 
17  బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని, క్రీస్తుయొక్క సిలువ వ్యర్థము కాకుండునట్లు, వాక్చాతుర్యము లేకుండ సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. 
18  సిలువనుగూర్చిన వార్త నశించుచున్నవారికి వెర్రితనముగాను రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 
19  ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరతునుఅని వ్రాయబడియున్నది. 2
20  జ్ఞాని యేమయ్యెను? శాస్త్రి యేమయ్యెను? ఈ లోకపు3తర్కవాది యేమయ్యెను? ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసియున్నాడు గదా? 
21  దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానముచేత దేవునిని ఎరుగకుండినందున, సువార్త ప్రకటనయను వెర్రితనముచేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయెను. 
22  యూదులు సూచక్రియలు చేయుమని అడుగుచున్నారు, హేల్లేనీయులు జ్ఞానము వెదకుచున్నారు. 
23  అయితే మేము సిలువవేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. 
24  ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడుగాని యూదులకేమి హెల్లేనీయులకేమి, పిలువబడినవారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై యున్నాడు. 
25  దేవుని వెర్రితనము మనుష్యజ్ఞానముకంటె జ్ఞానముగలది. దేవుని బలహీనత మనుష్యుల బలముకంటె బలమైనది. 
26  సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతినిజ్ఞానులైనను ఘనులైనను కులీనులైనను అనేకులు పిలువబడలేదు గాని 
27-29. ఏ శరీరియు దేవునియెదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని యున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. ఎన్నికైనవారిని వ్యర్థముచేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింపబడినవారిని, ఎన్నికలేనివారిని దేవుడు ఏర్పరచుకొని యున్నాడు. 
30  అయితే ఆయనమూలముగా మీరు క్రీస్తుయేసునందున్నారు. 
31  అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవునిమూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమాయెను. 
    Download Audio File

1 కొరింథీయులకు 2వ అధ్యాయము

1  సహోదరులారా, నేను మీయొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతోగాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చినవాడను కాను. 
2  నేను యేసుక్రీస్తును, అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరిదేనిని మీమధ్యనెరుగకుందునని నిశ్చయించుకొంటిని. 
3  మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణకుతోను మీయొద్దనుంటిని. 
4-5. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసికొనక దేవుని శక్తిని ఆధారము చేసికొనియుండవలెనని, నేను మాటలాడినను (సువార్త ) ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగింపక, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దుష్టాంతములనే వినియోగించితిని. 
6  పరిపూర్ణులైనవారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది యీ లోక2జ్ఞానము కాదు, నిరర్థకులై పోవుచున్న యీ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని 
7  దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము; ఈ జ్ఞానము మరుగైయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. 
8  అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు; అది వారికి తెలిసియుండినయెడల మహిమాస్వరూపియుగు ప్రభువును సిలువవేయక పోయియుందురు. 
9  ఇందునుగూర్చిదేవుడు తన్ను ప్రేమించువారకొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికివినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదుఅని వ్రాయబడియున్నది. 3
10  మనకైతే దేవుడు వాటిని తన ఆత్మవలన బయలుపరచి యున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు. 
11  ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనష్యాత్మకే గాని మనుష్యలలో మరి ఎవనికి తెలియును? ఆలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకేగాని మరి ఎవనికిని తెలియవు. 
12  దేవునివలన మనకు దయచేయబడినవాటిని తెలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక దేవునియొద్దనుండి వచ్చు ఆత్మను పొందియున్నాము. 
13  మనుష్యజ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మసంబంధమైన సంగతులను ఆత్మసంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటినిగూర్చియే మేము బోధించుచున్నాము. 
14  ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి; అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. 
15  ఆత్మసంబంధియైనవాడు అన్నిటిని వివేచించును గాని అతడెవనిచేతనైనను వివేచింపబడడు. 
16  ప్రభువు మనస్సు ఎరిగి ఆయనకు బోధింపగల వాడెవడు?మనమైతే క్రీస్తు మనస్సు కలిగినవారము. 
Download Audio File

1 కొరింథీయులకు 3వ అధ్యాయము

1  సహోదరులారా, ఆత్మసంబంధులైన మనుష్యులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేకపోతిని. శరీరసంబంధులైన మనుష్యలే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు, మీతో మాటలాడవలసి వచ్చెను. 
2  అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితినిగాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీరసంబంధులై యుండుటవలన ఇప్పుడును మీరు బలహీనులై యున్నారు కారా? 
3  మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీరసంబంధులై మనుష్యరీతిగా నడుచుకొనువారు కారా? 
4  ఒకడు - నేను పౌలువాడను, మరియొకడు - నేను అపొల్లోవాడను, అని చెప్పునప్పుడు మీరు (ప్రకృతిసంబంధులైన ) మనుష్యులు కారా? 
5  అపొల్లో ఎవడు? పౌలెవడు? పరిచారకులేగదా. ఒక్కక్కరికి ప్రభువనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి 
6  నేను నాటితిని, అపొల్లో నీళ్లుపోసెను, వృద్ధికలుగజేసినవాడు దేవుడే 
7  కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనేగాని, నాటువానిలోనైనను నీళ్లుపోయువానిలోనైనను ఏమియు లేదు. 
8  నాటువాడును నీళ్లుపోయువాడును ఒక్కటే. ప్రతివాడును తాను చేసిన కష్టముకొలది జీతము పుచ్చుకొనును. 
9  మేము దేవుని జతపనివారమై యున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుడు (కట్టు ) గృహమునై యున్నారు. 
10  దేవుడు నాకనుగ్రహించిన కృపచొప్పున నేను నేర్పరియైన శిల్పకారునివలె పునాది వేసితిని, మరియొకడు దానిమీద కట్టుచున్నాడు; ప్రతివాడు దాని మీద ఏలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. 
11  వేయబడినది తప్ప మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసుక్రీస్తే. 
12-13. ఎవడైనను ఈ పునాదిమీద బంగారము వెండి వెలగల రాళ్లు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైనవాటితో కట్టినయొడల, వాని వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్నిచేత బయలుపరచబడును 
14  పునాదిమీద ఒకడు కట్టిన పని నిలిచినయెడల వాడు జీతము పుచ్చుకొనును. 
15  ఒకని పని కాల్చివేయబడినయెడల వానికి నష్టము కలుగును; అతడు తనమట్టుకు రక్షింపబడును గాని అగ్నిలోనుండి తప్పించుకొన్నట్టు రక్షింపబడును. 
16  మీరు దేవుని ఆలయమైయున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? 
17  ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసినయెడల దేవుడు వాని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైయున్నది; మీరును పరిశుద్ధులై యున్నారు. 1
18  ఎవడును తన్నుతాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనినయెడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలెను. 
19  ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. 
20  - జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును2; మరియు-జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువుకు తెలియును3అని వ్రాయబడియున్నది. 
21  కాబట్టి యెవడును మనుష్యులయందు అతిశయింపకూడదు; సమస్తమును మీవి. 
22  పౌలైనను అపొల్లోయైనను కేఫాయైనను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతమందున్నవియైనను రాబోవునవియైనను సమస్తమును మీవే. 
23  మీరు క్రీస్తువారు; క్రీస్తు దేవునివాడు. 
Download Audio File

1 కొరింథీయులకు 4వ అధ్యాయము

1  ఈలాగున క్రీస్తు సేవకులమనియు, దేవుని మర్మముల విషయములో గృహనిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలెను. 
2  మరియు గృహనిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైనవాడై యుండుట అవశ్యము. 
3  మీ చేతనైనను ఏ మనుష్యునిచేతనైనను4నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి; నన్ను నేనే విమర్శించుకొనను. 
4  నాయందు నాకు ఏ దోషమును కానరాదు; అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే. 
5  కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చుపర్యంతము, దేనిగూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోకి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు, ప్రతివానికిని తగిన మెప్పు దేవునివలన కలుగును. 
6  సహోదరులారా, మీరు మమ్మును చూచి, లేఖనములయందు వ్రాసియున్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని, మీరొకని పక్షమున మరియొకని మీద ఉప్పొంగకుండునట్లు, ఈ మాటలు మీ నిమిత్తమై నామీదను అపొల్లోమీదను పెట్టుకొని సాదృశ్యరూపముగా చెప్పియున్నాను. 
7  ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగజేయువాడెవడు? నీకు కలిగినవాటిలో పరునివలన నీవు పొందనిది ఏది? పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేల? 
8  ఇదివరకే మీరేమియు కొదువలేక తృప్తులైతిరి, ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి, మమ్మును విడిచిపెట్టి మీరు రాజులైతిరి; అవును, మీరు రాజలైతే నాకు సంతోషమే; అప్పుడు మేమును మీతోకూడ రాజులమగుదుము గదా? 
9  మరణదండనకు విధింపబడినవారమైనట్టు దేవుడు అపొస్తలులమైన మమ్మును అందరికంటె కడపట ఉంచియున్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుష్యులకును వేడుకగానున్నాము. 
10  మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు; మేము బలహీనులము, మీరు బలవంతులు; మీరు ఘనులు, మేము ఘనహీనులము. 
11  ఈ గడియవరకు ఆకలిదప్పులు గలవారము, దిగంబరులము; పిడిగుద్దులు తినుచున్నాము; నిలువరమైన నివాసములేక యున్నాము; 
12  స్వహస్తములతో పని చేసి కష్టపడుచున్నాము. నిందింపబడియు దీవించుచున్నాము; హింసింపబడియు ఓర్చుకొనుచున్నాము; 
13  దూషింపబడియు బతిమాలుకొనుచున్నాము. లోకమునకు మురికిగాను అందరికి పెంటగాను ఇదివరకు ఎంచబడియున్నాము. 
14  మిమ్మును సిగ్గుపరచవలెనని కాదు గాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధిచెప్పుట కీమాటలు వ్రాయుచున్నాను. 
15-16. క్రీస్తునందు మీకు ఉపదేశకులు పదివేలమంది యున్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తుయేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొనువారై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. 
17  ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమొథెయును మీయొద్దకు పంపియున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకొను విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును, మీకు జ్ఞాపకము చేయును. 
18  నేను మీయెద్దకు రానని అనుకొని కొందరుప్పొంగుచున్నారు. 
19  ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీయొద్దకు వచ్చి ఉప్పొంగుచున్నవారి మాటలను కాదు వారి శక్తినే తెలిసికొందును. 
20  దేవునిరాజ్యము మాటలతో కాదు శక్తితోనే యున్నది. 
21  మీరేది కోరుచున్నారు? బెత్తముతో నేను మీయెద్దకు రావలెనా? ప్రేమతోను సాత్వికమైన మనస్సుతోను రావలెనా? 
Download Audio File

1 కొరింథీయులకు 5వ అధ్యాయము

1  మీలో జారత్వమున్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొన్నాడట. అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరుగదు. 
2  ఇట్లుండియు, మీరుప్పొంగుచున్నరే గాని మీరెంతమాత్రము దుఃఖపడి యీలాటి కార్యము చేసినవానిని మీలోనుండి వెలివేసినవారు కారు. 
3  నేను దేహవిషయమై దూరముగా ఉన్నను ఆత్మవిషయమై సమీపముగా ఉండి, మీతోకూడ ఉండినట్టుగానే యిట్టి కార్యము ఈలాగు చేసినవానిగూర్చి యిదివరకే తీర్పు తీర్చియున్నాను. 
4-5. ఏమనగా, ప్రభువైన యేసుదినమందు వాని ఆత్మ రక్షింపబడునట్లు శరీరేచ్ఛలు నశించుటకై, 1మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడివచ్చినప్పుడు, అట్టివానిని సాతానుకు అప్పగింపవలెను. 
6  మీరు అతిశయపడుట మంచిదికాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరెరుగరా? 
7  మీరు పులిపిండి లేనివారు గనుక కొత్తముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కాపశువు వధింపబడెను 
8  గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండ, నిష్కాపట్యమును సత్యమునను పులియనిరొట్టెతో పండుగ ఆచరింతము. 
9  జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసియుంటిని. 
10  అయితే ఈ లోకపు జారలతోనైనను లోభులతోనైనను దోచుకొనువారితోనైనను విగ్రహారాధకులతోనైనను ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు; ఆలాగైతే మీరు లోకములోనుండి వెళ్లిపోవలసివచ్చును గదా? 
11  ఇప్పుడైతే, సహోదరుడనబడిన వాడెవడైనను జారుడు గాని లోభిగాని విగ్రహారాధకుడుగాని తిట్టుబోతుగాని త్రాగుబోతుగాని దోచుకొనువాడుగాని అయియున్నయెడల, అట్టివానితో సాంగత్యము చేయకూడదు భుజింపనుకూడదని మీకు వ్రాయుచున్నాను. 
12  వెలుపటివారికి తీర్పు తీర్చుట నాకేల? వెలుపటివారికి దేవుడే తీర్పు తీర్చును గాని 
13  మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలోనుండి వెలివేయుడి. 
Download Audio File

1 కొరింథీయులకు 6వ అధ్యాయము

1  మీలో ఒకనికి మరియొకనిమీద వ్యాజ్యమున్నప్పుడు వాడు పరిశుద్దులయెదుట గాక అనీతిమంతుల యెదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? 
2  పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? మీవలన లోకమునకు తీర్పు జరుగవలసియుండగా, మిక్కిలి అల్పమైన సంగతులనుగూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? 
3  మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని యొరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులనుగూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును గదా? 
4  కాబట్టి యీ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగినయెడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడినవారిని కూర్చుండబెట్టుదురా?2
5  మీకు సిగ్గురావలెనని చెప్పుచున్నాను. ఏమి? తన సహోదరుల మధ్యను వాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒక్కడైనను లేడా? 
6  అయితే సహోదరుడు సహోదరునిమీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసుల యెదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. 
7  ఒకనిమీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. అంతకంటె అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటె మీ సొత్తులనపహరింపబడనిచ్చుట మేలు కాదా? 
8  అయితే మీరే అన్యాయము చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకే యీలాగు చేయుచున్నారు. 
9  అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవారైనను పురుషసంయోగులైనను 
10  దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. 
11  మీలో కొందరు అట్టివారైయుంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, పరిశుద్ధపరచబడినవారై నీతిమంతులుగా తీర్చబడితిరి. 
12  అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని నేను దేనిచేతను లోపరచుకొనబడనొల్లను. 
13  భోజనపదార్థములు కడుపుకును కడుపు భోజనపదార్థములకును నియమింపబడియున్నవి; దేవుడు దానిని వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు ప్రభువు నిమిత్తమే; మనలను కూడ తన శక్తివలన లేపును. 
14  దేవుడు ప్రభువును లేపెను; మనలనుకూడ తన శక్తివలన లేపును. 
15  మీ దేహములు క్రీస్తుకు అవయవములై యున్నవని మీరెరుగరా? నేను క్రీస్తుయొక్క అవయవములను తీసికొని వేశ్యయొక్క అవయవములుగా చేయుదునా?అదెంతమాత్రమును తగదు. 
16  వేశ్యతో కలిసికొనువాడు దానితో ఏకదేహమై యున్నాడని మీరెరుగరా?- వారిద్దరు ఏకశరీరమై యుందురు3అని (మోషే ) చెప్పుచున్నాడు గదా? 
17  అటువలె ప్రభువుతో కలిసికొనువాడు ఆయనతో ఏకాత్మయై యున్నాడు. 
18  జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపట ఉన్నది గాని జారత్వము చేయువాడు తన స్వంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. 
19  మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, 
20  విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. 
Download Audio File

1 కొరింథీయులకు 7వ అధ్యాయము

1  మీరు వ్రాసినవాటి విషయమై నేను చెప్పునదేమనగా - స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. 
2  అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి స్వభార్య యుండవలెను, ప్రతి స్త్రీకి స్వభర్త యుండవలెను. 
3  భర్త భార్యకును ఆలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. 
4  భర్తకే గాని భార్యకు తన దేహముపైని అధికారములేదు; ఆలాగున భార్యకు తన దేహముపైని అధికారములేదు; ఆలాగున భార్యకేగాని భర్తకు తన దేహముపైని అధికారములేదు. 
5  ప్రార్థనచేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలమువరకు ఉభయుల సమ్మతిచొప్పుననే తప్ప, ఒకరినొకరు ఎడబాయకుడి; మీరు మనస్సు నిలుపలేకపొయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలిసికొనుడి. 
  6-7. ఇది నా హితోపదేశమేగాని1ఆజ్ఞ కాదు; మనుష్యులందరు నావలె ఉండ గోరుచున్నాను. అయినను ఒకడొక విధమునను మరియొకడు మరియొక విధమునను ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొందియున్నాడు. 
8  నావలెనుండుట వారికి మేలని పెండ్లికానివారితోను విధవరాండ్లతోను చెప్పుచున్నాను. 
9  అయితే మనస్సు నిలుపలేనియొడల పెండ్లిచేసికొనవచ్చును; కామతప్తులగుటకంటె పెండ్లిచేసికొనుట మేలు. 
10  మరియు పెండ్లియైనవారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించునదేమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు. 
11  ఎడబాసినయెడల పెండ్లిచేసికొనకుండవలెను; లేదా, తన భర్తతో సమాధానపడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. 
12  ప్రభువు కాదు నేనే తక్కినవారితో చెప్పునదేమనగా - ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య కలిగియుండి, ఆమె అతనితో కాపురము చేయ నిష్టపడినయెడల, అతడు ఆమెను పరిత్యజింపకూడదు. 
13  మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసియైన భర్త కలిగియుండి, ఆమెతో కాపురము చేయ నిష్టపడినయెడల, ఆమె అతని పరిత్యజింపకూడదు. 
14  అవిశ్వాసియైన భర్త భార్యనుబట్టి పరిశుద్ధపరచబడును; అవిశ్వాసురాలైన భార్య విశ్వాసియైన భర్తనుబట్టి2పరిశుద్ధపరచబడును. లేనియెడల మీ పిల్లలు అపవిత్రులై యుందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. 
15  అయితే అవిశ్వాసియైనవాడు ఎడబాసిన ఎడబాయవచ్చును; అట్టి సందర్భములలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు. సమాధానముగా ఉండుటకే దేవుడు మనలను3పిలిచియున్నాడు. 
16  ఓ స్త్రీ, నీకేమి తెలియును? నీ భర్తను రక్షించెదవేమో. పురుషుడా, నీకేమి తెలియును? నీ భార్యను రక్షించెదవేమో 
17  అయితే ప్రభువు ప్రతివానికి ఏ స్థితి నియమించెనో, దేవుడు ప్రతివానిని ఏ స్థితియందు పిలిచెనో, ఆ స్థితియందే నడుచుకొనవలెను; ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను. 
18  సున్నతి పొందినవాడైనను పిలువబడెనా? అతడు సున్నతి పోగొట్టుకొనవలదు; సున్నతి పొందనివాడైనను పిలువబడెనా? సున్నతి పొందవలదు. 
19  దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే (ముఖ్యముగాని ) సున్నతి పొందుటయందు ఏమియు లేదు, సున్నతి పొందకపోవుటయందు ఏమియు లేదు. 
20  ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనేయుండవలెను. 
21  దాసుడవై యుండగా పిలువబడితివా? చింతపడవద్దు గాని స్వతంత్రుడవగుటకు శక్తి కలిగినయెకడల, స్వతంత్రుడవగుట మరి మంచిది. 4
22  ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువువలన స్వాతంత్ర్యము పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడైయుండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. 
23  మీరు విలువపెట్టి కొనబడినవారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి. 
24  సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో (సహవాసము కలిగి ) ఉండవలెను. 
25  కన్యకల విషయమై ప్రభువుయొక్క ఆజ్ఞ నేను పొందలేదు గాని నమ్మకమైనవాడనై యుండుటకు ప్రభువువలన కనికరము పొందినవాడనై నా తాత్పర్యము చెప్పుచున్నాను. 
26  ఇప్పటి ఇబ్బందినిబట్టి పురుషుడు తానున్న స్థితిలోనే యుండుట మేలని తలంచుచున్నాను. 
27  భార్యకు బద్ధుడవై యుంటివా? విడుదల కోరవద్దు. భార్యలేక విడిగానుంటివా? వివాహము కోరవద్దు. 
28  అయినను నీవు పెండ్లిచేసికొనినను పాపము లేదు, కన్యక పెండ్లిచేసికొనినను ఆమెకు పాపము లేదు; అవి మీకు కలుగకుండవలెనని కోరుచున్నాను. 
29  సహోదరులారా, నేను చెప్పునదేమనగా, కాలము సంకుచితమై యున్నది గనుక ఇక మీదట భార్యలు కలిగినవారు భార్యలు లేనట్టును 
30  ఏడ్చువారు ఏడ్వనట్టును సంతోషపడువారు సంతోషపడనట్టును కొనువారు తాము కొనినది తమది కానట్టును 
31  ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను; ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. 
32  మీరు చింతలేని వారై యుండవలెనని కోరుచున్నాను. పెండ్లికానివాడు ప్రభువును ఏలాగు సంతోషపెట్టగలనని ప్రభువు విషయమైన కార్యములనుగూర్చి చింతించుచున్నాడు. 
33  పెండ్లియైనవాడు భార్యను ఏలాగు సంతోషపెట్టగలనని లోకవిషయమైనవాటినిగూర్చి చింతించుచున్నాడు. 
34  అటువలెనే పెండ్లికాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్లయి యుండుటకు ప్రభువు విషయమైన కార్యములనుగూర్చి చింతించుచుందురు గాని పెండ్లియైనది భర్తను ఏలాగు సంతోషపెట్టగలనని లోకవిషయమైనవాటినిగూర్చి చింతించుచున్నది. 
35  మీకు ఉరియొడ్డవలెనని కాదుగాని మీరు యోగ్య ప్రవర్తనులై, తొందర యేమియు లేక ప్రభువు సన్నిధానవర్తనులై యుండవలెనని యిది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను. 
36  అయితే ఒకని కుమార్తెకు1 ఈడుమించిపోయిన పక్షమందును, ఆమెకు వివాహము చేయవలసివచ్చిన పక్షమందును, ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచినయెడల, అతడు తన యిష్టముచొప్పున చేయవచ్చును; అందులో పాపము లేదు, పెండ్లిచేసికొన వచ్చును గాని 
37  యెవడైనను తన కుమార్తెకు1పెండ్లిచేయనవసరములేక యుండి అతడు స్థిరచిత్తుడును, తన ఇష్టప్రకారము జరుప శక్తిగలవాడునై, ఆమెను వివాహము లేకుండ ఉంచవలెనని తన మనస్సులో నిశ్చయించుకొనినయెడల బాగుగా ప్రవర్తించుచన్నాడు. 
38  కాబట్టి తన కుమార్తెకు1పెండ్లిచేయువాడు బాగుగ ప్రవర్తించుచున్నాడు, పెండ్లిచేయనివాడు మరి బాగుగా ప్రవర్తంచుచున్నాడు. 
39  భార్య తన భర్త బ్రదికియున్నంతకాలము బద్ధురాలై యుండును, భర్త మృతిపొందినయెడల ఆమెకిష్టమైనవాని పెండ్లిచేసికొనుటకు స్వతంత్రురాలై యుండును గాని ప్రభువునందు మాత్రమే పెండ్లిచేసికొనవలెను. 
40  అయితే ఆమె విధవరాలుగా ఉండినట్టయిన మరి ధన్యురాలని నా అభిప్రాయము. దేవుని ఆత్మ నాకును కలిగియున్నదని తలంచుకొనుచున్నాను. 
Download Audio File

1 కొరింథీయులకు 8వ అధ్యాయము

1  విగ్రహములకు బలిగా అర్పించినవాటి విషయమై నేను చెప్పునదేమనగా - మనమందరము జ్ఞానము గలవారమని యెరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. 
2  ఒకడు తనకేమైనను తెలియుననుకొంటే తాను తెలిసికొనవలసినట్టు ఇంక ఏమియు తెలిసికొనినవాడుకాడు. 
3  ఒకడు దేవుని ప్రేమించినయెడల అతడు దేవునికి ఎరుకైనవాడే. 
4  కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించినవాటిని తినుట విషయమై (నేను చెప్పునదేమనగా ) - లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. 
  5-6. దేవతలనబడినవారును ప్రభువులనబడినవారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒకే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము. 
7  అయితే అందరియందు ఈ జ్ఞానము లేదు. కొందరిదివరకును విగ్రహమును ఆరాధించువారు గనుక (తాము భుజించుపదార్థములు ) విగ్రహమునకు బలియియ్యబడినవని యెంచి భుజించుదురు; ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది. 
8  భోజనమునుబట్టి దేవునియెదుట మనము మెప్పుపొందము; తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువలేదు. 
9  అయినను మీకు కలిగియున్న యీ స్వాతంత్ర్యమువలన బలహీనులకు అభ్యంతరము కలుగకుండ చూచుకొనుడి. 
10  ఏలయనగా జ్ఞానముగల నీవు విగ్రహాలయమందు భోజనపంక్తిని కూర్చుండగా ఒకడు చూచినయెడల, బలహీనమైన మనస్సాక్షిగల అతడు విగ్రహములకు బలి యియ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకొనును గదా? 
11  అందువలన ఎవనికొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానమునుబట్టి నశించును. 
12  ఈలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుటవలనను, వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుటవలనను, 2మీరు క్రీస్తుకు విరోధముగా పాపము చేయువారగుచున్నారు. 
13  కాబట్టి భోజనపదార్థమువలన నా సహోదరునికి అభ్యంతరము కలిగినయెడల, నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయకుండుటకై నేనెన్నటికిని మాంసము తినను. 
Download Audio File

1 కొరింథీయులకు 9వ అధ్యాయము

1  నేను స్వతంత్రుడను కానా? నేను అపొస్తలుడను కానా? మన ప్రభువైన యేసును నేను చూడలేదా? ప్రభువునందు నా పనికి ఫలము మీరు కారా? 
2  ఇతరులకు నేను అపొస్తలుడను కాకపోయినను మీ మట్టుకైనను అపొస్తలుడనై యున్నాను. ప్రభువునందు నా అపొస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా? 
3  నన్ను విమర్శించువారికి నేను చెప్ప సమాధానమిదే. 
4  తినుటకును త్రాగుటకును మాకు అధికారము లేదా? 
5  తక్కిన అపొస్తలులవలెను, ప్రభువుయొక్క సహోదరులవలెను, కేఫావలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా? 
6  మరియు పని చేయకుండుటకును నేనును బర్నబాయు మాత్రమే అధికారము లేనివారమా? 
7  ఎవడైనను తన స్వంత ఖర్చుపెట్టుకొని దండుకొలువు చేయునా? ద్రాక్షతోట వేసి దాని ఫలము తిననివాడెవడు? మందను కాచి మంద పాలు త్రాగనివాడెవడు? 
8  ఈ మాటలు లోకాచారమునుబట్టి1చెప్పుచున్నానా? ధర్మశాస్త్రముకూడ వీటిని చెప్పుచున్నది గదా? 
9  కళ్లము త్రొక్కుచున్న యెద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నది. 2
10  దేవుడు ఎడ్లకొరకు విచారించుచున్నాడా? కేవలము మనకొరకు దీని చెప్పుచున్నాడా? అవును, మనకొరకే గదా యీ మాట వ్రాయబడెను. ఏలయనగా, దున్నువాడు (పాలుపొందుదునను ) ఆశతో దున్నవలెను, కళ్లము త్రొక్కించువాడు పంటలో పాలుపొందుదునను ఆశతో త్రొక్కింపవలెను. 
11  మీ కొరకు ఆత్మసంబంధమైనవి మేము విత్తియుండగా మీ వలన శరీరసంబంధమైన ఫలములు కోసికొనుట గొప్పకార్యమా? 
12  ఇతరులకు మీ పైని యీ అధికారములో పాలు కలిగినయెడల మాకు ఎక్కువ కలదు గదా? అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు; క్రీస్తుసువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండుటకై అన్నిటిని సహించుచున్నాము. 
13  ఆలయకృత్యములు జరిగించువారు ఆలయమువలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠమునొద్ద కనిపెట్టుకొని యుండువారు బలిపీఠముతో పాలివారై యున్నారనియు మీరెరుగరా? 
14  ఆలాగున సువార్త ప్రచురించువారు సువార్తవలన జీవింపవలెనని ప్రభువు నియమించియున్నాడు. 
15  నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకొనలేదు; మీరు నాయెడల ఈలాగున జరుపవలెనని ఈ సంగతులు వ్రాయనులేదు. ఎవడైనను నా అతిశయమును నిరర్థకము చేయుటకంటె నాకు మరణమే మేలు. 
16  నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయకారణము లేదు. (సువార్తను ప్రకటింపవలసిన ) భారము నామీద మోపబడి యున్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ. 
17  ఇది నేనిష్టపడి చేసిన యెడల నాకు జీతము కలుగును. ఇష్టపడకపోయినను గృహనిర్వాకత్వము నాకు అప్పగింపబడెను. 
18  అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించునప్పుడు సువార్తయందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండ సువార్తను ఉచితముగా ప్రకటించుటయే (నాకున్న జీతము ) 
19  నేను అందరి విషయము స్వతంత్రుడనై యున్నను ఎక్కువమందిని సంపాదించికొనుటకై అందరికిని నన్ను నేనే దాసునిగా చేసికొంటిని. 
20  యూదులను సంపాదించికొనుటకు యూదులకు యూదునివలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించికొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడినవాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడినవానివలె ఉంటిని. 
21  దేవునివిషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తువిషయమై ధర్మశాస్త్రమునకు లోబడినవాడను. అయినను ధర్మశాస్త్రము లేనివారిని సంపాదించికొనుటకు ధర్మశాస్త్రము లేనివారికి ధర్మశాస్త్రము లేనివానివలె ఉంటిని. 
22  బలహీనులను సంపాదించికొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధముచేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికి అన్ని విధములవాడనై యున్నాను. 
23  మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దానికొరకే సమస్తమును చేయుచున్నాను. 
24  పందెపు రంగమందు పరిగెత్తువారందరు పరుగెత్తుదురు గాని యొక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలె మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి. 
25  మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. 
26  కాబట్టి నేను గురి చూడనివానివలె పరుగెత్తువాడను కాను, 
27  గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒక వేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దాని లోపరచుకొనుచున్నాను. 
Download Audio File

1 కొరింథీయులకు 10వ అధ్యాయము

1  సహోదరులారా, యీ సంగతి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు. అదేదనగా, మన పితరులందరు మేఘముక్రింద నుండిరి. వారందరును సముద్రములో నడిచిపోయిరి; 
2  అందరును మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి; 
3  అందరు ఆత్మసంబంధమైన ఒక్క ఆహారమునే భుజించిరి; 
4  అందరు ఆత్మసంబంధమైన ఒక్క పానీయమునే పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మసంబంధమైన బండలోనిది త్రాగిరి; 
5  అయితే వారిలో ఎక్కువమంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. 
6  వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. 
7  -జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు1వారిలో కొందరివలె మీరు విగ్రహారాధకులై యుండకుడి. 
8  మరియు వారివలె మనము వ్యభిచరింపక యుందము; వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే యిరువది మూడు వేలమందికూలిరి. 
9  మనము ప్రభువును2శోధింపక యుందము; వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. 
10  మీరు సణుగకుడి; వారిలో కొందరు సణిగి సంహారకునిచేత నశించిరి. 
11  ఈ సంగతులు దృష్టాంతరూపకములుగా వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. 
12  తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. 
13  సాధారణముగా మనుష్యులకు కలుగు శోధనతప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు; మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును. 
14  కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపొండి. 
15  బుద్ధిమంతులతో మాటలాడినట్లు మీతో మాటలాడుచున్నాను; నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. 
16  మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది3(త్రాగుట ) క్రీస్తు రక్తములో పాలుపుచ్చుకొనుటయే. మనము విరుచు రొట్టె (తినుట ) క్రీస్తు శరీరములో పాలుపుచ్చుకొనుటయే. 
17  మనమందరము ఆ యొకటే రొట్టెలో పాలుపుచ్చుకొనుచున్నాము; రొట్టె యొక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమైయున్నాము. 
18  శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలి అర్పించినవాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కాదా? 
19  ఇక నేను చెప్పునదేమి? విగ్రహార్పితములో ఏమైన ఉన్నదనియైనను విగ్రహములలో ఏమైన ఉన్నదనియైనను చెప్పెదనా? 
20  లేదుగాని అన్యజనులర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవుట నాకిష్టము లేదు. 
21  మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడ త్రాగనేరరు; ప్రభువు బల్లమీద ఉన్న దానిలోను దయ్యముల బల్లమీద ఉన్న దానిలోనుకూడ పాలుపొందనేరరు. 
22  ప్రభువుకు రోషము పుట్టించెదమా? ఆయనకంటె మనము బలవంతులమా? 
23  అన్ని విషయములయందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు. 
24  ఎవడును తనకొరకే కాదు ఎదుటివానికొరకు మేలుచేయ చూచుకొనవలెను. 
25  మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దాని తినవచ్చును. 
26  - భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివై యున్నవి. 4
27  అవిశ్వాసులలో ఒకడు విందుకు పిలిచినపుడు వెళ్లుటకు మీకు మనస్సుండినయెడల మీకు వడ్డించినది ఏదో దానిగూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక తినుడి. 
28  అయితే ఎవడైనను మీతో - ఇది బలి అర్పింపబడినదని చెప్పినయెడల అట్లు తెలిపినవాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి. 
29  మనస్సాక్షి నిమిత్తమనగా నీ స్వంత మనస్సాక్షి నిమిత్తము కాదు ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే యీలాగు చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకని మనస్సాక్షినిబట్టి నా స్వాతంత్ర్య విషయములో తీర్పు తీర్చబడనేల? 
30  నేను కృతజ్ఞతతో పుచ్చుకొనినయెడల నేను దేనినిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానో దానినిమిత్తము నేను దూషింపబడనేల? 
31  కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి. 
32  యూదులకైనను, హెల్లేనీయులకైనను, దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగజేయకుడి. 
33  ఈలాగు నేను కూడ స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలెనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరిని సంతోషపెట్టుచున్నాను. 
Download Audio File

1 కొరింథీయులకు 11వ అధ్యాయము

1  నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. 
2  మీరు అన్నివిషయములలో నన్ను జ్ఞాపకము చేసికొనుచు, నేను మీకు అప్పగించిన ప్రకారము కట్టడలను5గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. 
3  ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తుకు శిరస్సు దేవుడనియు మీరు తెలిసికొనవలెనని కోరుచున్నాను. 
4  ఏ పురుషుడును తలమీద ముసుకు వేసికొని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో, ఆ పురుషుడు తన తలను అవమానపరచును. 
5  ఏ స్త్రీ తలమీద ముసుకు వేసికొనక ప్రార్థనచేయునో లేక ప్రవచించునో, ఆ స్త్రీ తన తలను అవమానపరచును; ఏలయనగా ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే యుండును. 
6  స్త్రీ ముసుకు వేసికొననియెడల ఆమె తలవెండ్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుటయైనను క్షౌరము చేయించుకొనుటయైనను స్త్రీ కవమానమైతే ముసుకు వేసికొనవలెను. 
7  పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునైయున్నాడు గనుక తలమీద ముసుకు వేసికొనకూడదు గాని స్త్రీ పురుషుని మహిమయై యున్నది. 
8  ఏలయనగా స్త్రీ పురుషునినుండి కలిగెనే గాని పురుషుడు స్త్రీనుండి కలుగలేదు. 
9  మరియు స్త్రీ పురుషునికొరకే గాని పురుషుడు స్త్రీకొరకు సృష్టింపబడలేదు. 1
10  ఇందువలన దేవుదూతలనుబట్టి (భర్త ) అధికార సూచనగా స్త్రీకి తలమీద ముసుకు ఉండవలెను. 
11  అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు పురషునికి వేరుగా స్త్రీ లేదు. 
12  స్త్రీ పురుషుని మూలముగా ఏలాగు కలిగెనో ఆలాగే పురుషుడు స్త్రీనుండి కలిగెనుగాని సమస్తమైనవి దేవుని మూలముగా కలిగియున్నవి. 
13  మీలో మీరే యోచించుకొనుడి; స్త్రీ ముసుకులేనిదై దేవుని ప్రార్థించుట తగునా? 
14  పురుషుడు తలవెండ్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావసిద్ధముగా మీకు తోచునుగదా? 
15  స్త్రీకి తలవెండ్రుకలు పైటచెంగుగా ఇయ్యబడెను గనుక ఆమె తలవెండ్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము. 
16  ఎవడైనను కలహప్రియుడుగా కనబడినయెడల మాలోనైనను దేవుని సంఘములలోనైనను ఇట్టి ఆచారములేదని (వాడు తెలిసికొనవలెను. ) 
17  మీకు ఈ విధి నియమించుచు మిమ్మును మెచ్చుకొనను. మీరు కూడివచ్చుట యెక్కువ కీడుకేగాని యెక్కువ మేలుకు కాదు. 
18  మొదటి సంగతి యేమనగా, మీరు సంఘమందు కూడియున్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంతమట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. 
19  మీలో యోగ్యులైనవారెవరో కనబడునట్లు మీలో భిన్నాభిప్రాయములుండక విధిలేదు. 
20  మీరందరు కూడి వచ్చుచుండగా మీరు ప్రభువు రాత్రిభోజనము చేయుట సాధ్యము కాదు. 
21  ఏలయనగా మీరు ఆ భోజనము చేయునప్పుడు ఒకనికంటె ఒకడు ముందుగా తనమట్టుకు తాను భోజనము చేయుచున్నాడు; ఇందువలన ఒకడు ఆకలిగొనును మరియొకడు మత్తుడవును. 
22  ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిగూర్చి మిమ్మును మెచ్చుదునా? మెచ్చను. 
23  నేను ఈ విషయమై మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు అప్పగింపబడిన రాత్రి యొక రొట్టెను ఎత్తికొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి 
24  దాని విరిచి - యిది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీని చేయుడని చెప్పెను. 
25  ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొని - యీ పాత్ర నా రక్తమువలననైన క్రొత్తనిబంధన; మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీని చేయుడని చెప్పెను. 
26  మీరు ఈ రొట్టెను తిని యీ పాత్రలోనిది త్రాగునప్పుడెల్ల ప్రభువు వచ్చు పర్యంతము ఆయన మరణమును ప్రచురించుదురు. 
27  కాబట్టి యెవడు అయోగ్యముగా ప్రభువుయొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువుయొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. 
28  కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను; ఆలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. 
29  ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. 
30  ఇందువలననే మీలో అనేకులు బలహీనులును రోగులునై యున్నారు; చాలమంది నిద్రించుచున్నారు. 
31  అయితే మనలను మనమే విమర్శించుకొనినయెడల తీర్పు పొందక పోదుము. 
32  మనము తీర్పు పొందినయెడల లోకముతోపాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువుచేత శిక్షింపబడుచున్నాము. 
33  కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చునప్పుడు ఒకనికొరకు ఒకడు కనిపెట్టుకొని యుండుడి. 
34  మీరు కూడివచ్చుట శిక్షావిధికి కారణము కాకుండునట్లు, ఎవడైన ఆకలిగొనినయెడల తన యింటనే భోజనము చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరతును. 
Download Audio File

1 కొరింథీయులకు 12వ అధ్యాయము

1  మరియు సహోదరులారా, ఆత్మసంబంధమైన వరములనుగూర్చి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు. 
2  మీరు అన్యజనులై యున్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితిరని మీకు తెలియును. 
3  ఇందుచేత దేవుని ఆత్మవలన మాటలాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మవలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. 
4  కృపావరములు నానావిధములుగా ఉన్నవి గాని ఆత్మ యొక్కడే 
5  మరియు పరిచర్యలు నానావిధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే 
6  నానావిధములైన కార్యములు కలవు గాని అందరిలో అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే 
7  అయినను (అందరి ) ప్రయోజనముకొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. 
8  ఏలాగనగా, ఒకనికి ఆత్మమూలముగా జ్ఞానవాక్యమును, మరియొకనికి ఆ ఆత్మ ననుసరించిన బుద్ధివాక్యమును, 
9  మరియొకనికి ఆ ఆత్మవలననే విశ్వాసమును, మరియొకనికి ఆ ఒక్క ఆత్మవలననే స్వస్థపరచు వరములును 
10  మరియొకనికి అద్భుతకార్యములను చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరియొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడియున్నవి. 
11  అయినను వీటన్నిటిని ఆ ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి యిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. 
12  ఏలాగు శరీరము ఏకమై యున్నను అనేకమైన అవయవములు కలిగియున్నదో, యేలాగు శరీరముయొక్క అవయవములన్నియు అనేకములై యున్నను ఒక్క శరీరమై యున్నవో, ఆలాగే క్రీస్తు ఉన్నాడు. 
13  ఏలాగనగా, యూదులమైనను హెల్లేనీయులమైనను, దాసులమైనను స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరముగా ఉండుటకు1ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానముచేసినవారమైతిమి. 
14  శరీరమొక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. 
15  - నేను చెయ్యి కాను గనుక శరీరములోనిదానను కానని పాదము చెప్పినంతమాత్రమున శరీరములోనిది కాకపోలేదు. 
16  మరియు - నేను కన్నుకాను గనుక శరీరములోనిదానను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. 
17  శరీరమంతయు కన్నయితే వినుట ఎక్కడ? అంతయు వినుటయైతే వాసనచూచుట ఎక్కడ? 
18  అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్తప్రకారము శరీరములో నుంచెను. 
19  అవన్నియు ఒక్క అవయవమైతే శరీరమెక్కడ? 
20  అవయవములు అనేకములైనను శరీరమొక్కటే 
21  గనుక కన్ను చేతితో - నీవు నాకక్కరలేదని చెప్పజాలదు; తల పాదములతో - మీరు నాకక్కరలేదని చెప్పజాలదు. 
22  అంతే కాదు. శరీరముయొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే 
23  శరీరములో ఏ అవయవములు ఘనతలేనివని తలంతుమో ఆ అవయవములు మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. సుందరములకాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. 
 24-25. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యమక్కరలేదు. అయితే శరీరములో వివాదములేక, అవయవములు ఒకదానినొకటి యేకముగా పరామర్శించులాగున, దేవుడు తక్కువదానికే యెక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చియున్నాడు. 
26  కాగా ఒక అవయవము శ్రమపడునప్పుడు అవయవములన్నియు దానితో కూడ శ్రమపడును; ఒక అవయవము ఘనత పొందునప్పుడు అవయవములన్నియు దానితోకూడ సంతోషించును. 
27  అటువలె మీరు క్రీస్తుయొక్క శరీరమైయుండి వేరువేరుగా అవయవములై యున్నారు. 
28  మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలగాను, పిమ్మట కొందరిని బోధకులగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారినిగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారినిగాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను. 
29  అందరు అపొస్తలులా? అందరు అద్భుతములు చేయువారా? 
30  అందరు స్వస్థపరచు కృపావరములు గలవారా? అందరు ఆ భాషల అర్థము చెప్పుచున్నారా? 
31  కృపావరములలో శ్రేష్ఠమైనవాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. 
Download Audio File

1 కొరింథీయులకు 13వ అధ్యాయము

1  మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమలేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై యుందును. 
2  ప్రవచించు కృపావరము కలిగి, మర్మములన్నియు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసముగలవాడనైనను, ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను. 
3  (బీదల ) పోషణకొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమలేని వాడనైతే నాకు ప్రయోజనమేనియు లేదు. 
4  ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు; 
5  అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు. 
6  దుర్ణీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. 
7  అన్నిటికి తాళుకొనును;3అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును. 
8  ప్రేమ శాశ్వతకాలముండును. ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును;జ్ఞానమైనను నిరర్థకమగును. 
9  మనము కొంతమట్టుకు ఎరుగుదుము, కొంతమట్టుకు ప్రవచించుచున్నాము గాని 
10  పూర్ణమైనది వచ్చినప్పుడు అపూర్ణమైనది నిరర్థకమగును. 
11  నేను పిల్లవాడనై యున్నప్పుడు పిల్లవానివలె మాటలాడితిని, పిల్లవానివలె తలంచితిని, పిల్లవానివలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని. 
12  ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము; అప్పుడు ముఖాముఖిగా చూతుము; ఇప్పుడు కొంతమట్టుకే యెరిగియున్నాను; అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. 
13  కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలుచును; వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. 
Download Audio File

1 కొరింథీయులకు 14వ అధ్యాయము

1  ప్రేమ కలిగియుండుటకు ప్రయత్నించుడి. 1ఆత్మసంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి; విశేషముగా మీరు ప్రవచనవరము అపేక్షించుడి. 
2  ఎందుకనగా భాషతో మాటలాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాటలాడుచున్నాడు; మనుష్యుడెవడును గ్రహింపడుగాని వాడు ఆత్మవలన మర్మములను పలుకుచున్నాడు. 
3  క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు, ప్రవచించువాడు మనుష్యులతో మాటలాడుచున్నాడు. 
4  భాషతో మాటలాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసికొనును గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును. 
5  మీరందరు భాషలతో మాటలాడవలెనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందునిమిత్తము భాషలతో మాటలాడువాడు అర్థము చెప్పితేనేగాని వానికంటె ప్రవచించువాడే శ్రేష్ఠుడు. 
6  సహోదరులారా, ఆలోచించుడి; భాషలతో మాటలాడుచు నేను మీయెద్దకు వచ్చి (సత్యమును ) బయలుపరచవలెననియైనను జ్ఞానోపదేశము చేయవలెననియైనను ప్రవచింపవలెననియైనను బోధింపవలెననియైనను మీతో మాటలాడకపోయినయెడల, నావలన మీకు ప్రయోజనమేమి? 
7  పిల్లనగ్రోవి గాని వీణె గాని, నిర్జీవ వస్తువులు నాదమిచ్చునప్పుడు, స్వరములలో భేదము కలుగజేయనియెడల, ఊదినదేమి మీటినదేమి యని యేలాగు తెలియును? 
8  మరియు బూర స్పష్టముకాని ధ్వని ఇచ్చునప్పుడు యుద్ధమునకెవడు సిద్ధపడును? 
9  ఆలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనేగాని పలికినది ఏలాగు తెలియును? మీరు గాలితో మాటలాడుచున్నట్టుందురు. 
10  లోకమందు ఎన్నోవిధములగు భాషలున్నను వాటిలో ఒకటైనను స్పష్టము కానిదై యుండదు. 
11  మాటల అర్థము నాకు తెలియకుండినయెడల మాటలాడువానికి నేను పరిదేశినిగా ఉందును, మాటలాడువాడు నాకు పరదేశిగా ఉండును. 
12  మీరు ఆత్మసంబంధమైన వరముల విషయమై ఆసక్తిగలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగునిమిత్తము అవి మీకు విస్తరంచునట్లు ప్రయత్నము చేయుడి. 
13  భాషతో మాటలాడువాడు అర్థము చెప్పు శక్తికలుగుటకై ప్రార్థనచేయలెను. 
14  నేను భాషతో ప్రార్థనచేసినయెడల నా ఆత్మ ప్రార్థన చేయును గాని నా మనస్సు ఫలవంతముగా ఉండదు. 
15  కాబట్టి ఆత్మతో ప్రార్థనచేతును మనస్సుతోను ప్రార్థన చేతును; ఆత్మతోను పాడుదును, మనస్సుతోను పాడుదును. 
16  లేనియెడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు చెప్పుదాని గ్రహింపలేడు గనుక, నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు - ఆమేన్ అని వాడేలాగు పలుకును? 
17  నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు గాని ఎదుటివాడు క్షేమాభివృద్ధిపొందడు. 
18  నేను మీ యందరికంటె ఎక్కువగా భాషలతో మాటలాడుచున్నాను; అందుకు దేవుని స్తుతించెదను. 
19  అయినను సంఘములో భాషతో పదివేల మాటలు పలుకుటకంటె ఇతరులకు బోధ కలుగునట్లు నా మనస్సుతో అయిదు మాటలు పలుకుట మేలు. 
20  సహోదరులారా, మీరు బుద్ధివిషయమై పసిపిల్లలుకాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి; బుద్ధివిషయమై పెద్దవారలై యుండుడి. 
21  - అన్యభాషలు మాటలాడు జనులద్వారాను, పర జనుల పెదవులద్వారాను, ఈ జనులతో మాటలాడుదును; అప్పటికైనను వారు నా మాట వినకపోదురు. అని ప్రభువు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నది. 2
22  కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమైయున్నవి. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే (సూచకమైయున్నది ). 
23  సంఘమంతయు ఏకముగా కూడి అందరు భాషలతో మాటలాడుచుండగా, ఉపదేశము పొందనివారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చినయెడల మీరు వెర్రిమాటలాడుచున్నారని అనుకొందురు కదా? 
24  అయితే అందరు ప్రవచించుచుండగా అవిశ్వాసియైనను ఉపదేశము పొందనివాడైనను లోపలికి వచ్చినయెడల, అందరి బోధవలన తాను పాపినని గ్రహించి అందరివలన విమర్శింపబడును. 
25  అప్పుడతని హృదయ రహస్యములు బయలుపడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురముచేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారముచేయును. 
26  సహోదరులారా, యిప్పుడు మీలో ఏమి జరుగుచున్నది? మీరు కూడివచ్చునప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలెనని యున్నాడు; మరి ఒకడు బోధింపవలెనని యున్నాడు; మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటనపరచవలెనని యున్నాడు; మరి ఒకడు భాషతో మాటలాడవలెనని యున్నాడు; మరి ఒకడు అర్థము చెప్పవలెనని యున్నాడు. సరే; సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగనియ్యుడి. 
27  భాషతో ఎవడైనను మాటలాడితే, ఇద్దరు, అవసరమైనయెడల ముగ్గురికి మించకుండ, వంతులచొప్పున మాటలాడవలెను, ఒకడు అర్థము చెప్పవలెను. 
28  అర్థము చెప్పువాడు లేనియెడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెను గాని తనతోను దేవునితోను మాటలాడుకొనవచ్చును. 
29  ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాటలాడవచ్చును; తక్కినవారు వివేచింపవలెను. 
30  అయతే కూర్చున్న మరి యొకనికి ఏదైనను బయలుపరచబడినయెడల మొదటివాడు మౌనముగా ఉండవలెను. 
31  అందరు నేర్చుకొనునట్లు అందరు హెచ్చరికపొందునట్లును మీరందరు ఒకని తరువాత ఒకడు ప్రవచింపవచ్చును. 
32  మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి. 
33  ఆలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. 
34  స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను వారు లోబడియుండవలసినదే గాని మాటలాడుటకు వారికి సెలవులేదు. ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది1. 
35  వారు ఏమైనను నేర్చుకొనగోరినయెడల ఇంట తమ తమ భర్తల నడుగవలెను; సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము. 
36  దేవుని వాక్యము మీయెద్ద నుండియె బయలువెళ్లెనా? మీయెద్దకు మాత్రమే వచ్చెనా? 
37  ఎవడైనను తాను ప్రవక్తననియైనను ఆత్మసంబంధిననియైనను తలంచుకొనిన యెడల, నేను మీకు వ్రాయుచున్నవి ప్రభువుయొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలిసికొనవలెను. 
38  ఎవడైనను తెలియనివాడైతే తెలియనివాడుగానే యుండనిమ్ము2
39-40. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాటలాడుట ఆటంకపరచకుడి గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనియ్యుడి 
Download Audio File

1 కొరింథీయులకు 15వ అధ్యాయము

1-2. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలుపుచున్నాను. మీరు దాని అంగీకరించితిరి, దానియందే నిలిచియున్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశరూపకముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనియున్న పక్షమందు ఆ సువార్తవలననే మీరు రక్షణ పొందువారై యుందురు. 
3  నాకియ్యుబడిన ఉపదేశమును ముఖ్యమైనదిగా ఎంచి మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను, 
4  లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను. 
5  ఆయన కేఫాకును తరువాత పన్నెండుగురికిని కనబడెను. 
6  అటుపిమ్మట ఏనూటికి ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచియున్నారు, కొందరు నిద్రించిరి. 
7  తరువాత ఆయన యాకోబుకును, అటుతరువాత అపొస్తలులకందరికిని కనబడెను. 
8  అందరికి కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను; 
9  ఏలయనగా నేను అపొస్తలులందరిలో తక్కువైనవాడను. దేవుని సంఘమును హింసించినందున అపొస్తలుడనబడుటకు యోగ్యుడను కాను. 
10  అయినను నేనేమై యున్నానో అది దేవుని కృపవలననే అయియున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిఫ్పలము కాలేదు గాని వారందరికంటె నేనెక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైయున్న దేవుని కృపయే. 
11  నేనైననేమి వారైననేమి, ఆలాగుననే మేము ప్రకటించుచున్నాము, ఆలాగుననే మీరును విశ్వసించితిరి. 
12  క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు - మృతుల పునరుత్థానము లేదని యెట్లు చెప్పుచున్నారు? 
13  మృతుల పునరుత్థానము లేనియెడల క్రీస్తుకూడ లేపబడియుండలేదు. 
14  మరియు క్రీస్తు లేపబడియుండనియెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. 
15  ఆయన క్రీస్తును లేపెనని దేవునిగూర్చి మేము సాక్ష్యము చెప్పియున్నాము గదా; మృతులు లేపబడని పక్షమందు దేవుడాయనను లేప లేదు గనుక మేమును దేవుని విషయమై అబద్దపు సాక్షులముగా అగుపడుచున్నాము. 
16  మృతులు లేపబడనియెడల క్రీస్తుకూడ లేపబడలేదు. 
17  క్రీస్తు లేపబడనియెడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే యున్నారు. 
18  అంతేకాదు, క్రీస్తునందు నిద్రించినవారును నశించిరి. 
19  ఈ జీవిత కాలముమట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైనయెడల మనుష్యులందరికంటె దౌర్భాగ్యులమై యుందుము. 
20  ఇప్పుడైతే నిద్రించినవారిలో ప్రథమఫలముగా క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడు. 
21  మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. 
22  ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో ఆలాగుననే క్రీస్తునందు అందరును బ్రదికింపబడుదురు. 
23  ప్రతివాడును తన తన వరుసలోనే బ్రదికింపబడును; ప్రథమఫలము క్రీస్తు; తరువాత క్రీస్తు వచ్చినప్పుడు1ఆయనవారు బ్రదికింపబడుదురు. 
24  అటుతరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును; అప్పుడు అంతము వచ్చును. 
25  ఎందుకనగా తన శత్రువులనందరిని తన పాదములక్రింద ఉంచు పర్యంతము ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను. 
26  కడబట నశింపజేయబడు శత్రువు మరణము. 
27  దేవుడు సమస్తమును క్రీస్తు పాదములక్రింద లోపరచియుంచెను2. సమస్తమును లోపరచబడియున్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరచినవాడు తప్ప సమస్తమును లోపరచబడియున్నదను సంగతి విశదమే. 
28  మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సమస్తములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరచిన దేవునికి తానే లోబడును. 
29  ఇట్లు కానియెడల మృతులకొరకై బాప్తిస్మము పొందువారేమి చేతురు? మృతులేమాత్రమును లేపబడనియెడల మృతులకొరకు వారు బాప్తిస్మము పొందనేల? 
30  మరియు మేము గడియగడియకు ప్రాణభయముతో నుండనేల? 
31  సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తుయేసునందు మిమ్మునుగూర్చి నాకు కలిగియున్న అతిశయముతోడు నేను దినదినము చనిపోవుచున్నాను (అని చెప్పుదును. ) 
32  మనుష్యరీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడితిని; నాకు లాభమేమి? మృతులు లేపబడని పక్షమందు - రేపు చనిపోవుదుము గనుక తిందము త్రాగుదము. 
33  మోసపోకుడి. దుష్టసాంగత్యములు మంచి నడవడిని చెరుపును. 
34  నీతి ప్రవర్తనగలవారై మేల్కొని, పాపము చేయకుడి; దేవునిగూర్చిన జ్ఞానము కొందరికి లేదు. మీకు సిగ్గు కలుగుటకై యిట్లు చెప్పుచున్నాను. 
35  అయితే మృతులేలాగు లేతురు? వారెట్టి శరీరముతో వత్తురని యొకడు అడుగును. 
36  ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రదికింపబడదు గదా. 
37  నీవు విత్తుదానిని చూడగా అది గోధుమగింజయైనను సరే, మరి ఏ గింజయైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. 
38  అయితే దేవుడే తన చిత్తప్రకారము నీవు విత్తినదానికి శరీరము ఇచ్చును. మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. 
39  మనుష్యమాంసము వేరు, మృగమాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు. 
40  మరియు ఆకాశవస్తురూపములు కలవు, భూవస్తురూపములు కలవు; ఆకాశ వస్తురూపముల మహిమ వేరు, భూవస్తురూపముల మహిమ వేరు. 
41  సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమనుబట్టి యొక నక్షత్రమునకును మరియొక నక్షత్రమునకు భేదము కలదు గదా? 
42  మృతుల పునరుత్థానమును ఆలాగే (శరీరము ) క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును; 
43  ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును; బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును; 
44  ప్రకృతిసంబంధ శరీరముగా విత్తబడి ఆత్మసంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతిసంబంధ శరీరమున్నది గనుక ఆత్మసంబంధ శరీరముకూడ ఉన్నది. 
45  ఇందువిషయమై - ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయెనని వ్రాయబడియున్నది. 3కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయెను. 
46  ఆత్మసంబంధమైనది మొదట కలిగినది కాదు ప్రకృతిసంబంధమైనదే మొదట కలిగినది; తరువాత ఆత్మసంబంధమైనది. 
47  మొదటి మనుష్యుడు భూసంబంధియై మంటినుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకమునుండి వచ్చినవాడు. 
48  మంటినుండి పుట్టినవాడెట్టివాడో మంటినుండి పుట్టినవారును అట్టివారే, పరలోకసంబంధి యెట్టివాడో పరలోకసంబంధులును అట్టివారే. 
49  మరియు మనము మంటినుండి పుట్టినవాని పోలికను ధరించినప్రకారము పరలోకసంబంధి పొలికయు ధరింతుము. 
50  సహోదరులారా, నేను చెప్పనది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు; క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. 
51-52. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మనమందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్పపాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయలుగా లేపబడుదురు, మనము మార్పుపొందుదుము. 
53  క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించుకొనవలసియున్నది; మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసియున్నది. 
54  ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు, - విజయము కలుగునట్లుగా మరణము మ్రింగబడెనుఅని వ్రాయబడిన వాక్యము నెరవేరును. 4
55  ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? 
56  మరణపుముల్లు పాపము; పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. 
57  అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగుగాక. 
58  కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి. 
Download Audio File

1 కొరింథీయులకు 16వ అధ్యాయము

1  పరిశుద్ధులకొరకైన చ 0దావిషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. 
2  నేను వచ్చినప్పుడు చందా పోగుచేయకుండ ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తానువర్ధిల్లినకొలది తనయొద్ద కొంత సొమ్ము నిలువచేయవలెను. 
3  నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులనియెంచి పత్రికలిత్తురో వారిచేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేముకు పంపుదును. 
4  నేనుకూడ వెళ్లుట యుక్తమైనయెడల వారు నాతో కూడ వత్తురు. 
5  అయితే మకెదొనియలో సంచారమునకు వెళ్ల నుద్దేశించుచున్నాను గనుక మకెదొనియలో సంచారమునకు వెళ్లినప్పుడు మీయొద్దకు వచ్చెదను. 
6  అయితే మీయొద్ద కొంతకాలము ఆగవచ్చును, ఒక వేళ శీతకాలమంతయు గడుపుదును. అప్పుడు నేను వెళ్లెడి స్ధలమునకు మీరు నన్ను సాగనంపవచ్చును. 
7-8. ప్రభువు సెలవైతే మీయొద్ద కొంతకాలముండ నిరీక్షీంచుచున్నాను గనుక ఇప్పుడు మార్గములో మిమ్మును చూచుటకు నాకు మనస్సులేదు. 
9  కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించియున్నది;1మరియు ఎదిరించువారు అనేకులున్నారు గనుక పెంతెకొస్తువరకు ఎఫెసులో నిలిచియుందును. 
10  తిమొథెయు వచ్చినయెడల అతడు మీయొద్ద నిర్భయుడై యుండునట్లు చూచుకొనుడి. నావలెనే అతడు ప్రభువు పనిచేయుచున్నాడు 
11  గనుక ఎవడైన అతని తృణీకరింపవద్దు. నాయొద్దకు వచ్చుటకు అతని సమాధానముతో సాగనంపుడి; అతడు సహోదరులతో కూడ వచ్చునని యెదురు చూచుచున్నాను. 
12  సహోదరుడైన అపొల్లోనుగూర్చిన సంగతి ఏమనగా, అతడీ సహోదరులతో కూడ మీయొద్దకు వెళ్లవలెనని నేనతని చాల బతిమాలుకొంటిని గాని, యిప్పుడు వచ్చుటకు అతనికి ఎంతమాత్రమును మనస్సులేదు, వీలైనప్పుడతడు వచ్చును. 
13  మెళుకువగా ఉండుడి, విశ్వాసమందు నిలుకడగా ఉండుడి, పౌరుషముగలవారై యుండుడి, బలవంతులై యుండుడి; 
14  మీరు చేయు కార్యములన్నియు ప్రేమతో చేయుడి. 
15  స్తెఫను ఇంటివారు అకైయయొక్క ప్రథమఫలమైయున్నారనియు, వారు పరిశుద్ధులకు పరిచర్యచేయుటకు తమ్మును తాము అప్పగించుకొని యున్నారనియు మీకు తెలియును. 
16  కాబట్టి సహోదరులారా, అట్టి వారికిని, పనిలో సహాయముచేయుచు ప్రయాసపడుచు ఉండువారికందరికిని మీరు విధేయులై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. 
17-18. స్తెఫను, ఫొర్తునాతు, అకాయికు అనువారు వచ్చినందున స 0తోషి 0చుచున్నాను. మీరులేని వెలితిని వీరు నాకు స 0పూర్తిచేసి, నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగజేసిరి గనుక అట్టివారిని సన్మానించుడి. 
19  ఆసియలోని సంఘములవారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల్ల అనువారును వారి యింటనున్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. 
20  సహోదరులందరు మీకు వందనములు చెప్పుచున్నారు. పవిత్రమైన ముద్దుపెట్టుకొని మీరు ఒకరికి ఒకరు వందనములు చేసికొనుడి. 
21  పౌలను నేను నా చేతితోనే వందనవచనము వ్రాయుచున్నాను. 
22  ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడు గాక; ప్రభువు వచ్చియున్నాడు. 2
23  ప్రభువైన యేసుక్రీస్తు కృపమీకు తోడైయుండును గాక. 
24  క్రీస్తుయేసునందలి నా ప్రేమ మీయందరితో ఉండునుగాక. ఆమేన్. 
Download Audio File