1 పరిశుద్ధులకొరకైన చ 0దావిషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి.
2 నేను వచ్చినప్పుడు చందా పోగుచేయకుండ ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తానువర్ధిల్లినకొలది తనయొద్ద కొంత సొమ్ము నిలువచేయవలెను.
3 నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులనియెంచి పత్రికలిత్తురో వారిచేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేముకు పంపుదును.
4 నేనుకూడ వెళ్లుట యుక్తమైనయెడల వారు నాతో కూడ వత్తురు.
5 అయితే మకెదొనియలో సంచారమునకు వెళ్ల నుద్దేశించుచున్నాను గనుక మకెదొనియలో సంచారమునకు వెళ్లినప్పుడు మీయొద్దకు వచ్చెదను.
6 అయితే మీయొద్ద కొంతకాలము ఆగవచ్చును, ఒక వేళ శీతకాలమంతయు గడుపుదును. అప్పుడు నేను వెళ్లెడి స్ధలమునకు మీరు నన్ను సాగనంపవచ్చును.
7-8. ప్రభువు సెలవైతే మీయొద్ద కొంతకాలముండ నిరీక్షీంచుచున్నాను గనుక ఇప్పుడు మార్గములో మిమ్మును చూచుటకు నాకు మనస్సులేదు.
9 కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించియున్నది;1మరియు ఎదిరించువారు అనేకులున్నారు గనుక పెంతెకొస్తువరకు ఎఫెసులో నిలిచియుందును.
10 తిమొథెయు వచ్చినయెడల అతడు మీయొద్ద నిర్భయుడై యుండునట్లు చూచుకొనుడి. నావలెనే అతడు ప్రభువు పనిచేయుచున్నాడు
11 గనుక ఎవడైన అతని తృణీకరింపవద్దు. నాయొద్దకు వచ్చుటకు అతని సమాధానముతో సాగనంపుడి; అతడు సహోదరులతో కూడ వచ్చునని యెదురు చూచుచున్నాను.
12 సహోదరుడైన అపొల్లోనుగూర్చిన సంగతి ఏమనగా, అతడీ సహోదరులతో కూడ మీయొద్దకు వెళ్లవలెనని నేనతని చాల బతిమాలుకొంటిని గాని, యిప్పుడు వచ్చుటకు అతనికి ఎంతమాత్రమును మనస్సులేదు, వీలైనప్పుడతడు వచ్చును.
13 మెళుకువగా ఉండుడి, విశ్వాసమందు నిలుకడగా ఉండుడి, పౌరుషముగలవారై యుండుడి, బలవంతులై యుండుడి;
14 మీరు చేయు కార్యములన్నియు ప్రేమతో చేయుడి.
15 స్తెఫను ఇంటివారు అకైయయొక్క ప్రథమఫలమైయున్నారనియు, వారు పరిశుద్ధులకు పరిచర్యచేయుటకు తమ్మును తాము అప్పగించుకొని యున్నారనియు మీకు తెలియును.
16 కాబట్టి సహోదరులారా, అట్టి వారికిని, పనిలో సహాయముచేయుచు ప్రయాసపడుచు ఉండువారికందరికిని మీరు విధేయులై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.
17-18. స్తెఫను, ఫొర్తునాతు, అకాయికు అనువారు వచ్చినందున స 0తోషి 0చుచున్నాను. మీరులేని వెలితిని వీరు నాకు స 0పూర్తిచేసి, నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగజేసిరి గనుక అట్టివారిని సన్మానించుడి.
19 ఆసియలోని సంఘములవారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల్ల అనువారును వారి యింటనున్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు.
20 సహోదరులందరు మీకు వందనములు చెప్పుచున్నారు. పవిత్రమైన ముద్దుపెట్టుకొని మీరు ఒకరికి ఒకరు వందనములు చేసికొనుడి.
21 పౌలను నేను నా చేతితోనే వందనవచనము వ్రాయుచున్నాను.
22 ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడు గాక; ప్రభువు వచ్చియున్నాడు. 2
23 ప్రభువైన యేసుక్రీస్తు కృపమీకు తోడైయుండును గాక.
24 క్రీస్తుయేసునందలి నా ప్రేమ మీయందరితో ఉండునుగాక. ఆమేన్.
Download Audio File

No comments:
Post a Comment