1-2. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలుపుచున్నాను. మీరు దాని అంగీకరించితిరి, దానియందే నిలిచియున్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశరూపకముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనియున్న పక్షమందు ఆ సువార్తవలననే మీరు రక్షణ పొందువారై యుందురు.
3 నాకియ్యుబడిన ఉపదేశమును ముఖ్యమైనదిగా ఎంచి మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను,
4 లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను.
5 ఆయన కేఫాకును తరువాత పన్నెండుగురికిని కనబడెను.
6 అటుపిమ్మట ఏనూటికి ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచియున్నారు, కొందరు నిద్రించిరి.
7 తరువాత ఆయన యాకోబుకును, అటుతరువాత అపొస్తలులకందరికిని కనబడెను.
8 అందరికి కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను;
9 ఏలయనగా నేను అపొస్తలులందరిలో తక్కువైనవాడను. దేవుని సంఘమును హింసించినందున అపొస్తలుడనబడుటకు యోగ్యుడను కాను.
10 అయినను నేనేమై యున్నానో అది దేవుని కృపవలననే అయియున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిఫ్పలము కాలేదు గాని వారందరికంటె నేనెక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైయున్న దేవుని కృపయే.
11 నేనైననేమి వారైననేమి, ఆలాగుననే మేము ప్రకటించుచున్నాము, ఆలాగుననే మీరును విశ్వసించితిరి.
12 క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు - మృతుల పునరుత్థానము లేదని యెట్లు చెప్పుచున్నారు?
13 మృతుల పునరుత్థానము లేనియెడల క్రీస్తుకూడ లేపబడియుండలేదు.
14 మరియు క్రీస్తు లేపబడియుండనియెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే.
15 ఆయన క్రీస్తును లేపెనని దేవునిగూర్చి మేము సాక్ష్యము చెప్పియున్నాము గదా; మృతులు లేపబడని పక్షమందు దేవుడాయనను లేప లేదు గనుక మేమును దేవుని విషయమై అబద్దపు సాక్షులముగా అగుపడుచున్నాము.
16 మృతులు లేపబడనియెడల క్రీస్తుకూడ లేపబడలేదు.
17 క్రీస్తు లేపబడనియెడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే యున్నారు.
18 అంతేకాదు, క్రీస్తునందు నిద్రించినవారును నశించిరి.
19 ఈ జీవిత కాలముమట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైనయెడల మనుష్యులందరికంటె దౌర్భాగ్యులమై యుందుము.
20 ఇప్పుడైతే నిద్రించినవారిలో ప్రథమఫలముగా క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడు.
21 మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను.
22 ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో ఆలాగుననే క్రీస్తునందు అందరును బ్రదికింపబడుదురు.
23 ప్రతివాడును తన తన వరుసలోనే బ్రదికింపబడును; ప్రథమఫలము క్రీస్తు; తరువాత క్రీస్తు వచ్చినప్పుడు1ఆయనవారు బ్రదికింపబడుదురు.
24 అటుతరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును; అప్పుడు అంతము వచ్చును.
25 ఎందుకనగా తన శత్రువులనందరిని తన పాదములక్రింద ఉంచు పర్యంతము ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను.
26 కడబట నశింపజేయబడు శత్రువు మరణము.
27 దేవుడు సమస్తమును క్రీస్తు పాదములక్రింద లోపరచియుంచెను2. సమస్తమును లోపరచబడియున్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరచినవాడు తప్ప సమస్తమును లోపరచబడియున్నదను సంగతి విశదమే.
28 మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సమస్తములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరచిన దేవునికి తానే లోబడును.
29 ఇట్లు కానియెడల మృతులకొరకై బాప్తిస్మము పొందువారేమి చేతురు? మృతులేమాత్రమును లేపబడనియెడల మృతులకొరకు వారు బాప్తిస్మము పొందనేల?
30 మరియు మేము గడియగడియకు ప్రాణభయముతో నుండనేల?
31 సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తుయేసునందు మిమ్మునుగూర్చి నాకు కలిగియున్న అతిశయముతోడు నేను దినదినము చనిపోవుచున్నాను (అని చెప్పుదును. )
32 మనుష్యరీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడితిని; నాకు లాభమేమి? మృతులు లేపబడని పక్షమందు - రేపు చనిపోవుదుము గనుక తిందము త్రాగుదము.
33 మోసపోకుడి. దుష్టసాంగత్యములు మంచి నడవడిని చెరుపును.
34 నీతి ప్రవర్తనగలవారై మేల్కొని, పాపము చేయకుడి; దేవునిగూర్చిన జ్ఞానము కొందరికి లేదు. మీకు సిగ్గు కలుగుటకై యిట్లు చెప్పుచున్నాను.
35 అయితే మృతులేలాగు లేతురు? వారెట్టి శరీరముతో వత్తురని యొకడు అడుగును.
36 ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రదికింపబడదు గదా.
37 నీవు విత్తుదానిని చూడగా అది గోధుమగింజయైనను సరే, మరి ఏ గింజయైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు.
38 అయితే దేవుడే తన చిత్తప్రకారము నీవు విత్తినదానికి శరీరము ఇచ్చును. మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు.
39 మనుష్యమాంసము వేరు, మృగమాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు.
40 మరియు ఆకాశవస్తురూపములు కలవు, భూవస్తురూపములు కలవు; ఆకాశ వస్తురూపముల మహిమ వేరు, భూవస్తురూపముల మహిమ వేరు.
41 సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమనుబట్టి యొక నక్షత్రమునకును మరియొక నక్షత్రమునకు భేదము కలదు గదా?
42 మృతుల పునరుత్థానమును ఆలాగే (శరీరము ) క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును;
43 ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును; బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును;
44 ప్రకృతిసంబంధ శరీరముగా విత్తబడి ఆత్మసంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతిసంబంధ శరీరమున్నది గనుక ఆత్మసంబంధ శరీరముకూడ ఉన్నది.
45 ఇందువిషయమై - ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయెనని వ్రాయబడియున్నది. 3కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయెను.
46 ఆత్మసంబంధమైనది మొదట కలిగినది కాదు ప్రకృతిసంబంధమైనదే మొదట కలిగినది; తరువాత ఆత్మసంబంధమైనది.
47 మొదటి మనుష్యుడు భూసంబంధియై మంటినుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకమునుండి వచ్చినవాడు.
48 మంటినుండి పుట్టినవాడెట్టివాడో మంటినుండి పుట్టినవారును అట్టివారే, పరలోకసంబంధి యెట్టివాడో పరలోకసంబంధులును అట్టివారే.
49 మరియు మనము మంటినుండి పుట్టినవాని పోలికను ధరించినప్రకారము పరలోకసంబంధి పొలికయు ధరింతుము.
50 సహోదరులారా, నేను చెప్పనది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు; క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు.
51-52. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మనమందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్పపాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయలుగా లేపబడుదురు, మనము మార్పుపొందుదుము.
53 క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించుకొనవలసియున్నది; మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసియున్నది.
54 ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు, - విజయము కలుగునట్లుగా మరణము మ్రింగబడెనుఅని వ్రాయబడిన వాక్యము నెరవేరును. 4
55 ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ?
56 మరణపుముల్లు పాపము; పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే.
57 అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగుగాక.
58 కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి.
Download Audio File

No comments:
Post a Comment