1 మీలో ఒకనికి మరియొకనిమీద వ్యాజ్యమున్నప్పుడు వాడు పరిశుద్దులయెదుట గాక అనీతిమంతుల యెదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా?
2 పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? మీవలన లోకమునకు తీర్పు జరుగవలసియుండగా, మిక్కిలి అల్పమైన సంగతులనుగూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా?
3 మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని యొరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులనుగూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును గదా?
4 కాబట్టి యీ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగినయెడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడినవారిని కూర్చుండబెట్టుదురా?2
5 మీకు సిగ్గురావలెనని చెప్పుచున్నాను. ఏమి? తన సహోదరుల మధ్యను వాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒక్కడైనను లేడా?
6 అయితే సహోదరుడు సహోదరునిమీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసుల యెదుటనే వ్యాజ్యమాడుచున్నాడు.
7 ఒకనిమీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. అంతకంటె అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటె మీ సొత్తులనపహరింపబడనిచ్చుట మేలు కాదా?
8 అయితే మీరే అన్యాయము చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకే యీలాగు చేయుచున్నారు.
9 అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవారైనను పురుషసంయోగులైనను
10 దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.
11 మీలో కొందరు అట్టివారైయుంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, పరిశుద్ధపరచబడినవారై నీతిమంతులుగా తీర్చబడితిరి.
12 అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని నేను దేనిచేతను లోపరచుకొనబడనొల్లను.
13 భోజనపదార్థములు కడుపుకును కడుపు భోజనపదార్థములకును నియమింపబడియున్నవి; దేవుడు దానిని వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు ప్రభువు నిమిత్తమే; మనలను కూడ తన శక్తివలన లేపును.
14 దేవుడు ప్రభువును లేపెను; మనలనుకూడ తన శక్తివలన లేపును.
15 మీ దేహములు క్రీస్తుకు అవయవములై యున్నవని మీరెరుగరా? నేను క్రీస్తుయొక్క అవయవములను తీసికొని వేశ్యయొక్క అవయవములుగా చేయుదునా?అదెంతమాత్రమును తగదు.
16 వేశ్యతో కలిసికొనువాడు దానితో ఏకదేహమై యున్నాడని మీరెరుగరా?- వారిద్దరు ఏకశరీరమై యుందురు3అని (మోషే ) చెప్పుచున్నాడు గదా?
17 అటువలె ప్రభువుతో కలిసికొనువాడు ఆయనతో ఏకాత్మయై యున్నాడు.
18 జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపట ఉన్నది గాని జారత్వము చేయువాడు తన స్వంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు.
19 మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు,
20 విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.
Download Audio File

No comments:
Post a Comment