Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, July 26, 2013

1 కొరింథీయులకు 11వ అధ్యాయము

1  నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. 
2  మీరు అన్నివిషయములలో నన్ను జ్ఞాపకము చేసికొనుచు, నేను మీకు అప్పగించిన ప్రకారము కట్టడలను5గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. 
3  ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తుకు శిరస్సు దేవుడనియు మీరు తెలిసికొనవలెనని కోరుచున్నాను. 
4  ఏ పురుషుడును తలమీద ముసుకు వేసికొని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో, ఆ పురుషుడు తన తలను అవమానపరచును. 
5  ఏ స్త్రీ తలమీద ముసుకు వేసికొనక ప్రార్థనచేయునో లేక ప్రవచించునో, ఆ స్త్రీ తన తలను అవమానపరచును; ఏలయనగా ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే యుండును. 
6  స్త్రీ ముసుకు వేసికొననియెడల ఆమె తలవెండ్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుటయైనను క్షౌరము చేయించుకొనుటయైనను స్త్రీ కవమానమైతే ముసుకు వేసికొనవలెను. 
7  పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునైయున్నాడు గనుక తలమీద ముసుకు వేసికొనకూడదు గాని స్త్రీ పురుషుని మహిమయై యున్నది. 
8  ఏలయనగా స్త్రీ పురుషునినుండి కలిగెనే గాని పురుషుడు స్త్రీనుండి కలుగలేదు. 
9  మరియు స్త్రీ పురుషునికొరకే గాని పురుషుడు స్త్రీకొరకు సృష్టింపబడలేదు. 1
10  ఇందువలన దేవుదూతలనుబట్టి (భర్త ) అధికార సూచనగా స్త్రీకి తలమీద ముసుకు ఉండవలెను. 
11  అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు పురషునికి వేరుగా స్త్రీ లేదు. 
12  స్త్రీ పురుషుని మూలముగా ఏలాగు కలిగెనో ఆలాగే పురుషుడు స్త్రీనుండి కలిగెనుగాని సమస్తమైనవి దేవుని మూలముగా కలిగియున్నవి. 
13  మీలో మీరే యోచించుకొనుడి; స్త్రీ ముసుకులేనిదై దేవుని ప్రార్థించుట తగునా? 
14  పురుషుడు తలవెండ్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావసిద్ధముగా మీకు తోచునుగదా? 
15  స్త్రీకి తలవెండ్రుకలు పైటచెంగుగా ఇయ్యబడెను గనుక ఆమె తలవెండ్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము. 
16  ఎవడైనను కలహప్రియుడుగా కనబడినయెడల మాలోనైనను దేవుని సంఘములలోనైనను ఇట్టి ఆచారములేదని (వాడు తెలిసికొనవలెను. ) 
17  మీకు ఈ విధి నియమించుచు మిమ్మును మెచ్చుకొనను. మీరు కూడివచ్చుట యెక్కువ కీడుకేగాని యెక్కువ మేలుకు కాదు. 
18  మొదటి సంగతి యేమనగా, మీరు సంఘమందు కూడియున్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంతమట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. 
19  మీలో యోగ్యులైనవారెవరో కనబడునట్లు మీలో భిన్నాభిప్రాయములుండక విధిలేదు. 
20  మీరందరు కూడి వచ్చుచుండగా మీరు ప్రభువు రాత్రిభోజనము చేయుట సాధ్యము కాదు. 
21  ఏలయనగా మీరు ఆ భోజనము చేయునప్పుడు ఒకనికంటె ఒకడు ముందుగా తనమట్టుకు తాను భోజనము చేయుచున్నాడు; ఇందువలన ఒకడు ఆకలిగొనును మరియొకడు మత్తుడవును. 
22  ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిగూర్చి మిమ్మును మెచ్చుదునా? మెచ్చను. 
23  నేను ఈ విషయమై మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు అప్పగింపబడిన రాత్రి యొక రొట్టెను ఎత్తికొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి 
24  దాని విరిచి - యిది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీని చేయుడని చెప్పెను. 
25  ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొని - యీ పాత్ర నా రక్తమువలననైన క్రొత్తనిబంధన; మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీని చేయుడని చెప్పెను. 
26  మీరు ఈ రొట్టెను తిని యీ పాత్రలోనిది త్రాగునప్పుడెల్ల ప్రభువు వచ్చు పర్యంతము ఆయన మరణమును ప్రచురించుదురు. 
27  కాబట్టి యెవడు అయోగ్యముగా ప్రభువుయొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువుయొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. 
28  కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను; ఆలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. 
29  ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. 
30  ఇందువలననే మీలో అనేకులు బలహీనులును రోగులునై యున్నారు; చాలమంది నిద్రించుచున్నారు. 
31  అయితే మనలను మనమే విమర్శించుకొనినయెడల తీర్పు పొందక పోదుము. 
32  మనము తీర్పు పొందినయెడల లోకముతోపాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువుచేత శిక్షింపబడుచున్నాము. 
33  కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చునప్పుడు ఒకనికొరకు ఒకడు కనిపెట్టుకొని యుండుడి. 
34  మీరు కూడివచ్చుట శిక్షావిధికి కారణము కాకుండునట్లు, ఎవడైన ఆకలిగొనినయెడల తన యింటనే భోజనము చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరతును. 
Download Audio File

No comments:

Post a Comment