Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, July 26, 2013

1 కొరింథీయులకు 12వ అధ్యాయము

1  మరియు సహోదరులారా, ఆత్మసంబంధమైన వరములనుగూర్చి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు. 
2  మీరు అన్యజనులై యున్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితిరని మీకు తెలియును. 
3  ఇందుచేత దేవుని ఆత్మవలన మాటలాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మవలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. 
4  కృపావరములు నానావిధములుగా ఉన్నవి గాని ఆత్మ యొక్కడే 
5  మరియు పరిచర్యలు నానావిధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే 
6  నానావిధములైన కార్యములు కలవు గాని అందరిలో అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే 
7  అయినను (అందరి ) ప్రయోజనముకొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. 
8  ఏలాగనగా, ఒకనికి ఆత్మమూలముగా జ్ఞానవాక్యమును, మరియొకనికి ఆ ఆత్మ ననుసరించిన బుద్ధివాక్యమును, 
9  మరియొకనికి ఆ ఆత్మవలననే విశ్వాసమును, మరియొకనికి ఆ ఒక్క ఆత్మవలననే స్వస్థపరచు వరములును 
10  మరియొకనికి అద్భుతకార్యములను చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరియొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడియున్నవి. 
11  అయినను వీటన్నిటిని ఆ ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి యిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. 
12  ఏలాగు శరీరము ఏకమై యున్నను అనేకమైన అవయవములు కలిగియున్నదో, యేలాగు శరీరముయొక్క అవయవములన్నియు అనేకములై యున్నను ఒక్క శరీరమై యున్నవో, ఆలాగే క్రీస్తు ఉన్నాడు. 
13  ఏలాగనగా, యూదులమైనను హెల్లేనీయులమైనను, దాసులమైనను స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరముగా ఉండుటకు1ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానముచేసినవారమైతిమి. 
14  శరీరమొక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. 
15  - నేను చెయ్యి కాను గనుక శరీరములోనిదానను కానని పాదము చెప్పినంతమాత్రమున శరీరములోనిది కాకపోలేదు. 
16  మరియు - నేను కన్నుకాను గనుక శరీరములోనిదానను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. 
17  శరీరమంతయు కన్నయితే వినుట ఎక్కడ? అంతయు వినుటయైతే వాసనచూచుట ఎక్కడ? 
18  అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్తప్రకారము శరీరములో నుంచెను. 
19  అవన్నియు ఒక్క అవయవమైతే శరీరమెక్కడ? 
20  అవయవములు అనేకములైనను శరీరమొక్కటే 
21  గనుక కన్ను చేతితో - నీవు నాకక్కరలేదని చెప్పజాలదు; తల పాదములతో - మీరు నాకక్కరలేదని చెప్పజాలదు. 
22  అంతే కాదు. శరీరముయొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే 
23  శరీరములో ఏ అవయవములు ఘనతలేనివని తలంతుమో ఆ అవయవములు మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. సుందరములకాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. 
 24-25. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యమక్కరలేదు. అయితే శరీరములో వివాదములేక, అవయవములు ఒకదానినొకటి యేకముగా పరామర్శించులాగున, దేవుడు తక్కువదానికే యెక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చియున్నాడు. 
26  కాగా ఒక అవయవము శ్రమపడునప్పుడు అవయవములన్నియు దానితో కూడ శ్రమపడును; ఒక అవయవము ఘనత పొందునప్పుడు అవయవములన్నియు దానితోకూడ సంతోషించును. 
27  అటువలె మీరు క్రీస్తుయొక్క శరీరమైయుండి వేరువేరుగా అవయవములై యున్నారు. 
28  మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలగాను, పిమ్మట కొందరిని బోధకులగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారినిగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారినిగాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను. 
29  అందరు అపొస్తలులా? అందరు అద్భుతములు చేయువారా? 
30  అందరు స్వస్థపరచు కృపావరములు గలవారా? అందరు ఆ భాషల అర్థము చెప్పుచున్నారా? 
31  కృపావరములలో శ్రేష్ఠమైనవాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. 
Download Audio File

No comments:

Post a Comment