1 ప్రేమ కలిగియుండుటకు ప్రయత్నించుడి. 1ఆత్మసంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి; విశేషముగా మీరు ప్రవచనవరము అపేక్షించుడి.
2 ఎందుకనగా భాషతో మాటలాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాటలాడుచున్నాడు; మనుష్యుడెవడును గ్రహింపడుగాని వాడు ఆత్మవలన మర్మములను పలుకుచున్నాడు.
3 క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు, ప్రవచించువాడు మనుష్యులతో మాటలాడుచున్నాడు.
4 భాషతో మాటలాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసికొనును గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును.
5 మీరందరు భాషలతో మాటలాడవలెనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందునిమిత్తము భాషలతో మాటలాడువాడు అర్థము చెప్పితేనేగాని వానికంటె ప్రవచించువాడే శ్రేష్ఠుడు.
6 సహోదరులారా, ఆలోచించుడి; భాషలతో మాటలాడుచు నేను మీయెద్దకు వచ్చి (సత్యమును ) బయలుపరచవలెననియైనను జ్ఞానోపదేశము చేయవలెననియైనను ప్రవచింపవలెననియైనను బోధింపవలెననియైనను మీతో మాటలాడకపోయినయెడల, నావలన మీకు ప్రయోజనమేమి?
7 పిల్లనగ్రోవి గాని వీణె గాని, నిర్జీవ వస్తువులు నాదమిచ్చునప్పుడు, స్వరములలో భేదము కలుగజేయనియెడల, ఊదినదేమి మీటినదేమి యని యేలాగు తెలియును?
8 మరియు బూర స్పష్టముకాని ధ్వని ఇచ్చునప్పుడు యుద్ధమునకెవడు సిద్ధపడును?
9 ఆలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనేగాని పలికినది ఏలాగు తెలియును? మీరు గాలితో మాటలాడుచున్నట్టుందురు.
10 లోకమందు ఎన్నోవిధములగు భాషలున్నను వాటిలో ఒకటైనను స్పష్టము కానిదై యుండదు.
11 మాటల అర్థము నాకు తెలియకుండినయెడల మాటలాడువానికి నేను పరిదేశినిగా ఉందును, మాటలాడువాడు నాకు పరదేశిగా ఉండును.
12 మీరు ఆత్మసంబంధమైన వరముల విషయమై ఆసక్తిగలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగునిమిత్తము అవి మీకు విస్తరంచునట్లు ప్రయత్నము చేయుడి.
13 భాషతో మాటలాడువాడు అర్థము చెప్పు శక్తికలుగుటకై ప్రార్థనచేయలెను.
14 నేను భాషతో ప్రార్థనచేసినయెడల నా ఆత్మ ప్రార్థన చేయును గాని నా మనస్సు ఫలవంతముగా ఉండదు.
15 కాబట్టి ఆత్మతో ప్రార్థనచేతును మనస్సుతోను ప్రార్థన చేతును; ఆత్మతోను పాడుదును, మనస్సుతోను పాడుదును.
16 లేనియెడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు చెప్పుదాని గ్రహింపలేడు గనుక, నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు - ఆమేన్ అని వాడేలాగు పలుకును?
17 నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు గాని ఎదుటివాడు క్షేమాభివృద్ధిపొందడు.
18 నేను మీ యందరికంటె ఎక్కువగా భాషలతో మాటలాడుచున్నాను; అందుకు దేవుని స్తుతించెదను.
19 అయినను సంఘములో భాషతో పదివేల మాటలు పలుకుటకంటె ఇతరులకు బోధ కలుగునట్లు నా మనస్సుతో అయిదు మాటలు పలుకుట మేలు.
20 సహోదరులారా, మీరు బుద్ధివిషయమై పసిపిల్లలుకాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి; బుద్ధివిషయమై పెద్దవారలై యుండుడి.
21 - అన్యభాషలు మాటలాడు జనులద్వారాను, పర జనుల పెదవులద్వారాను, ఈ జనులతో మాటలాడుదును; అప్పటికైనను వారు నా మాట వినకపోదురు. అని ప్రభువు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నది. 2
22 కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమైయున్నవి. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే (సూచకమైయున్నది ).
23 సంఘమంతయు ఏకముగా కూడి అందరు భాషలతో మాటలాడుచుండగా, ఉపదేశము పొందనివారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చినయెడల మీరు వెర్రిమాటలాడుచున్నారని అనుకొందురు కదా?
24 అయితే అందరు ప్రవచించుచుండగా అవిశ్వాసియైనను ఉపదేశము పొందనివాడైనను లోపలికి వచ్చినయెడల, అందరి బోధవలన తాను పాపినని గ్రహించి అందరివలన విమర్శింపబడును.
25 అప్పుడతని హృదయ రహస్యములు బయలుపడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురముచేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారముచేయును.
26 సహోదరులారా, యిప్పుడు మీలో ఏమి జరుగుచున్నది? మీరు కూడివచ్చునప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలెనని యున్నాడు; మరి ఒకడు బోధింపవలెనని యున్నాడు; మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటనపరచవలెనని యున్నాడు; మరి ఒకడు భాషతో మాటలాడవలెనని యున్నాడు; మరి ఒకడు అర్థము చెప్పవలెనని యున్నాడు. సరే; సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగనియ్యుడి.
27 భాషతో ఎవడైనను మాటలాడితే, ఇద్దరు, అవసరమైనయెడల ముగ్గురికి మించకుండ, వంతులచొప్పున మాటలాడవలెను, ఒకడు అర్థము చెప్పవలెను.
28 అర్థము చెప్పువాడు లేనియెడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెను గాని తనతోను దేవునితోను మాటలాడుకొనవచ్చును.
29 ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాటలాడవచ్చును; తక్కినవారు వివేచింపవలెను.
30 అయతే కూర్చున్న మరి యొకనికి ఏదైనను బయలుపరచబడినయెడల మొదటివాడు మౌనముగా ఉండవలెను.
31 అందరు నేర్చుకొనునట్లు అందరు హెచ్చరికపొందునట్లును మీరందరు ఒకని తరువాత ఒకడు ప్రవచింపవచ్చును.
32 మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి.
33 ఆలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు.
34 స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను వారు లోబడియుండవలసినదే గాని మాటలాడుటకు వారికి సెలవులేదు. ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది1.
35 వారు ఏమైనను నేర్చుకొనగోరినయెడల ఇంట తమ తమ భర్తల నడుగవలెను; సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము.
36 దేవుని వాక్యము మీయెద్ద నుండియె బయలువెళ్లెనా? మీయెద్దకు మాత్రమే వచ్చెనా?
37 ఎవడైనను తాను ప్రవక్తననియైనను ఆత్మసంబంధిననియైనను తలంచుకొనిన యెడల, నేను మీకు వ్రాయుచున్నవి ప్రభువుయొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలిసికొనవలెను.
38 ఎవడైనను తెలియనివాడైతే తెలియనివాడుగానే యుండనిమ్ము2
39-40. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాటలాడుట ఆటంకపరచకుడి గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనియ్యుడి
Download Audio File

No comments:
Post a Comment