1 సహోదరులారా, నేను మీయొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతోగాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చినవాడను కాను.
2 నేను యేసుక్రీస్తును, అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరిదేనిని మీమధ్యనెరుగకుందునని నిశ్చయించుకొంటిని.
3 మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణకుతోను మీయొద్దనుంటిని.
4-5. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసికొనక దేవుని శక్తిని ఆధారము చేసికొనియుండవలెనని, నేను మాటలాడినను (సువార్త ) ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగింపక, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దుష్టాంతములనే వినియోగించితిని.
6 పరిపూర్ణులైనవారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది యీ లోక2జ్ఞానము కాదు, నిరర్థకులై పోవుచున్న యీ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని
7 దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము; ఈ జ్ఞానము మరుగైయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను.
8 అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు; అది వారికి తెలిసియుండినయెడల మహిమాస్వరూపియుగు ప్రభువును సిలువవేయక పోయియుందురు.
9 ఇందునుగూర్చిదేవుడు తన్ను ప్రేమించువారకొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికివినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదుఅని వ్రాయబడియున్నది. 3
10 మనకైతే దేవుడు వాటిని తన ఆత్మవలన బయలుపరచి యున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు.
11 ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనష్యాత్మకే గాని మనుష్యలలో మరి ఎవనికి తెలియును? ఆలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకేగాని మరి ఎవనికిని తెలియవు.
12 దేవునివలన మనకు దయచేయబడినవాటిని తెలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక దేవునియొద్దనుండి వచ్చు ఆత్మను పొందియున్నాము.
13 మనుష్యజ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మసంబంధమైన సంగతులను ఆత్మసంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటినిగూర్చియే మేము బోధించుచున్నాము.
14 ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి; అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.
15 ఆత్మసంబంధియైనవాడు అన్నిటిని వివేచించును గాని అతడెవనిచేతనైనను వివేచింపబడడు.
16 ప్రభువు మనస్సు ఎరిగి ఆయనకు బోధింపగల వాడెవడు?మనమైతే క్రీస్తు మనస్సు కలిగినవారము.
Download Audio File

No comments:
Post a Comment