1 దేవుని చిత్తమువలన యేసు క్రీస్తు1యొక్క అపొస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సొస్తెనేసును
2 కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికిని, వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతిస్థలములో ప్రార్థించు వారికందరికిని (శుభమని చెప్పి ) వ్రాయునది.
3 మన తండ్రియైన దేవునినుండియు, ప్రభువైన యేసుక్రీస్తునుండియు కృపాసమాధానములు మీకు కలుగుగాక.
4 క్రీస్తుయేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
5-6. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయనయందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్తోపదేశములోను సమస్త జ్ఞానములోను సంపూర్ణులైతిరి;
7 గనుక ఏ కృపావరమునందును లోపములేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షతకొరకు ఎదురుచూచుచున్నారు.
8 మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై యుండునట్లు అంతమువరకు ఆయన మిమ్మును స్థిరపరచును.
9 మన ప్రభువైన యేసుక్రీస్తను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు.
10 సహోదరులారా, మీరందరు ఏకభావముతో మాటలాడవలెననియు, మీలో కక్షలు లేక యేకమనస్సుతోను ఏకతాత్పర్యముతోను మీరు సన్నద్ధులైయుండవలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తుపేరట మిమ్మును వేడుకొనుచున్నాను.
11 నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మునుగూర్చి క్లోయే యింటివారివలన నాకు తెలియవచ్చెను.
12 మీలో ఒకడు - నేను పౌలువాడను, ఒకడు - అపొల్లోవాడను, మరియెకడు - నేను కేఫావాడను, ఇంకొకడు - నేను క్రీస్తువాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము.
13 క్రీస్తు విభజింపబడి యున్నాడా? పౌలు మీకొరకు సిలువ వేయబడెనా? పౌలు నామమున మీరు బాప్తిస్మముపొందితిరా?
14-15. నా నామమున మీరు బాప్తిస్మము పొందితిరని యెవరైనను చెప్పకుండునట్లు, క్రిస్పుకును గాయియుకును తప్ప మరి ఎవరికిని నేను బాప్తిస్మమియ్యలేదు; అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
16 స్తెఫను ఇంటివారికి బాప్తిస్మమిచ్చితిని; వీరికి తప్ప మరి ఎవరికైనను బాప్తిస్మమిచ్చితినేమో నేనెరుగను.
17 బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని, క్రీస్తుయొక్క సిలువ వ్యర్థము కాకుండునట్లు, వాక్చాతుర్యము లేకుండ సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను.
18 సిలువనుగూర్చిన వార్త నశించుచున్నవారికి వెర్రితనముగాను రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.
19 ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరతునుఅని వ్రాయబడియున్నది. 2
20 జ్ఞాని యేమయ్యెను? శాస్త్రి యేమయ్యెను? ఈ లోకపు3తర్కవాది యేమయ్యెను? ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసియున్నాడు గదా?
21 దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానముచేత దేవునిని ఎరుగకుండినందున, సువార్త ప్రకటనయను వెర్రితనముచేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయెను.
22 యూదులు సూచక్రియలు చేయుమని అడుగుచున్నారు, హేల్లేనీయులు జ్ఞానము వెదకుచున్నారు.
23 అయితే మేము సిలువవేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము.
24 ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడుగాని యూదులకేమి హెల్లేనీయులకేమి, పిలువబడినవారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై యున్నాడు.
25 దేవుని వెర్రితనము మనుష్యజ్ఞానముకంటె జ్ఞానముగలది. దేవుని బలహీనత మనుష్యుల బలముకంటె బలమైనది.
26 సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతినిజ్ఞానులైనను ఘనులైనను కులీనులైనను అనేకులు పిలువబడలేదు గాని
27-29. ఏ శరీరియు దేవునియెదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని యున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. ఎన్నికైనవారిని వ్యర్థముచేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింపబడినవారిని, ఎన్నికలేనివారిని దేవుడు ఏర్పరచుకొని యున్నాడు.
30 అయితే ఆయనమూలముగా మీరు క్రీస్తుయేసునందున్నారు.
31 అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవునిమూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమాయెను.
Download Audio File

No comments:
Post a Comment